.webp)
బిగ్ బాస్ తెలుగు సీజన్-10 లో ఎనిమిదో వారం 'బిబి హోటల్' టాస్క్ సాగింది. ఇందులో త్రిగుణ్ అల్టిమేట్ గోట్ అండ్ కెప్టెన్ అయ్యాడు. ఇక హౌస్ మేట్స్ ఓటింగ్ ప్రకారం ఎవరు ఎలిమినేషన్ అవుతారని ఓటింగ్ పెట్టాడు బిగ్ బాస్. ఇందులో రామకృష్ణ, రోహిత్ కి సమానంగా ఓట్లు వచ్చాయి. కానీ బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు సుధీర్ ఎలిమినేషన్ అని ప్రకటించాడు. అయితే ముఖేష్ తన పవర్ కీ ని ఉపయోగించి ఝాన్సీ పవర్ కీ ని రివైవ్ చేశాడు. దాంతో ఎలిమినేషన్ అయ్యే సుధీర్ ని ఝాన్సీ సేవ్ చేసింది.
అయితే ఇప్పుడు హౌస్ నుండి ఝాన్సీ ఎలిమినేట్ అయినట్లు సోషల్ మీడియాలో లేటెస్ట్ లీక్ వస్తోంది. ఈ వారం రెడ్ జోన్ లో ఉన్న ఝాన్సీ, రామకృష్ణ, శివ, సుధీర్ లలో ఝాన్సీ జర్నీ AV ని బిగ్ బాస్ టీమ్ రెడీ చేయడంతో ఆమె ఎలిమినేషన్ దాదాపు కన్ఫమ్ అయింది. గత ఎపిసోడ్ లోనే ముఖేష్ పవర్ తో సుధీర్ ని సేవ్ చేయడానికి తన ఎలిమినేషన్ ఫ్రీ పాస్ ని వాడేసింది ఝాన్సీ. ఆ పవర్ లేకపోవడంతో ఇప్పుడు ఆమె డైరెక్ట్ గా డేంజర్ లో పడింది.
వీక్ 8 అన్ అఫీషియల్ ఓటింగ్ లో కూడా ఝాన్సీ 7.72% ఓట్లతో బాటమ్ 3 లో ఉంది. విలేజ్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చి, స్ట్రాంగ్ గేమ్ ఆడిన ఝాన్సీ 8 వారాల పాటు హౌస్ లో కొనసాగింది. ముఖ్యంగా ముకేష్, సుధీర్, వర్షిణి తో ఆమె ఫ్రెండ్షిప్ హైలైట్ గా నిలిచింది.ఝాన్సీ ఎలిమినేషన్ తో పాటు రామకృష్ణ AV కూడా రెడీ అవ్వడంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా లేక ఝాన్సీ సింగిల్ ఎలిమినేషనా అనేది శనివారం నాగార్జున ఎపిసోడ్ లో తేలనుంది.ప్రస్తుతం సోషల్ మీడియాలో #WeSupportJhansi ట్రెండ్ అవుతోంది.




.webp)

