
జీ తెలుగులో సెలబ్రిటీ టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి బాబు సీజన్ 1 మంచి రేటింగ్ సంపాదించుకుని హిట్ షోగా నిలిచింది. ఇక ఇప్పుడు సీజన్ 2 మొదలు కాతోంది. ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ కి సాయి పల్లవి గెస్ట్ గా వచ్చింది. నేచురల్ హీరో నాని ఐతే నేచురల్ బ్యూటీ హీరోయిన్ సాయి పల్లవి. ఈమె హీరోయిన్ మాత్రమే కాదు డాన్సర్ కూడా. అలలాంటి సాయి పల్లవి నాగ చైతన్యతో , మెగా ఫామిలీ హీరో వరుణ్ తేజ్ తో కలిసి నటించింది.
ఇక ఫస్ట్ ఎపిసోడ్ లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. ఆమె రాగానే జగపతి బాబు ఆమెతో చిట్ చాట్ మొదలుపెట్టారు. ఫస్ట్ డైలాగ్ అనగానే "హాయ్ ఐ యాం మలార్ " అని చెప్పింది." ఫేస్బుక్ లో అందరూ హీరోయిన్స్ ఫేసెస్ డిపిగా పెట్టుకుంటారు కదా. ప్రేమమ్ మూవీ అయ్యాక సడెన్ గా నా ఫేస్ ఉంది. నా ఫేస్ నిండా ఇంకా పింపుల్స్ ఉండేవి ఇంకా రూమ్ సర్వీస్ కి ఆర్డర్ చేసేటప్పుడు వాళ్ళు ఎస్ సర్ అంటారు" అని చెప్పేసరికి జగపతి బాబు నవ్వేశారు.
"నీకు జయమ్ము నిశ్చయమ్మురా అని ఫీలైన మూమెంట్ ఏంటి " అని అడిగారు జగపతి బాబు. "ఏ సెట్ లో నేను ఓడిపోయానో ఆ సెట్ లోనే ప్రభుదేవా మాష్టర్ నాకు కొరియోగ్రాఫ్ చేశారు రౌడీ బేబీ సాంగ్ కి . హార్డవర్క్ చేసి వెయిట్ చేస్తే ఏ టైములో ఏది రావాలో అది వస్తుంది" అని చెప్పింది. "అందుకేనేమో సీత పాత్ర నిన్ను వరించింది " అన్నారు జగపతిబాబు. "రణబీర్ కపూర్ తో ఏదన్న వర్క్ షాప్ జరిగిందా" అని అడిగారు. ఇంతలో ఆన్ లైన్లోకి రణబీర్ కపూర్ వచ్చి "నమస్కారం జగపతి బాబు గారు. సాయి నీలో నాకు నచ్చింది నిజాయితీ. ప్రతీ కో-స్టార్ కి మీలాంటి వారితో ఫ్రేమ్ పంచుకునే వారు ఉంటే నిజంగా అదృష్టమే. ఇక సీత పాత్ర విషయానికి వస్తే ఆ పాత్రలో మిమ్మల్ని తప్ప వేరే వారిని ఊహించుకోలేను. ప్రజలు మిమ్మల్ని ఒక కొత్త కోణంలో చూడబోతున్నారు. నేను కూడా వెయిట్ చేస్తున్నా. తెలుగు ఆడియన్స్ మీ ప్రేమకు నా ధన్యవాదాలు." అని చెప్పారు.






