
జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 జోర్దార్ గా సాగుతోంది. ఫస్ట్ ఎపిసోడ్ కి సాయి పల్లవిని తీసుకొచ్చారు జగపతి బాబు. ఇక ఈ షోలో పల్లవితో కలిసి రెండు సినిమాల్లో నటించిన నాగ చైతన్య ఒక వీడియో రికార్డు చేసి పంపారు. అందులో ఆయన సాయి పల్లవిని గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను షేర్ చేసారు. ఇంతకు ఆయన ఆ వీడియోలో ఎం అన్నారంటే...
"హాయ్ పల్లవి ఎలా ఉన్నావు. చావ్ మామ షోలో ఉన్నందుకు చాల సంతోషంగా ఉంది. నేను లాస్ట్ సీజన్ లో వచ్చాను. సెప్టెంబర్ లో మన లవ్ స్టోరీ మూవీ చేసి 5 ఇయర్స్ అయ్యింది. ఆ మెమోరీస్ అన్నీ గుర్తు తెచ్చుకున్నాను. రెండో మూడో రోజు షూటింగ్ స్టార్ట్ ఐన తర్వాత నువ్వు వచ్చి చాల అమాయకంగా అడిగావు. నా జుట్టుకు నేను ఉల్లిపాయల నీళ్లు రాసుకుంటే నీకేమైనా ఇబ్బందా , ఆ స్మెల్ నీకు ఒకే కదా అని. నాకు చాలా వింతగా అనిపించింది. నో అని ఎలా చెప్పాలో అర్ధం కాలేదు. లక్కీ నువ్వు కూడా రాసుకోలేదు. ఆ సంఘటన గుర్తొచ్చినప్పుడల్లా నాకు నవ్వొస్తూ ఉంటుంది. చావ్ మామ తాను ఎక్కువగా మాట్లాడట్లేదు అంటే నమ్మమాకండి. ఆమె మంచి మూడ్ లోకి రావాలి మాట్లాడాలి ఎనెర్జీగా అంటే అరలీటరు కొబ్బరి నీళ్లు ఇవ్వండి లేదా బన్ మస్కా ఇవ్వండి. ఆమె మింట్స్ తెచ్చుకుంటుంది తనతో పాటు. గంటకోసారి తింటూనే ఉంటుంది. ఆమె ఎనెర్జీకి సీక్రెట్ వెపన్ అని కూడా చెప్పొచ్చు. ఇదంతా పక్కన పెడితే పల్లవి నీ జర్నీ చూస్తూ ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. నీకు నువ్వు ఒక స్ట్రాంగ్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నావు నీకు నువ్వు కొత్త దారి వేసుకున్నావ్. ఒక డెడికేటెడ్, ఓర్పు ఉన్న ఒక నటితో నేను నటించడం సంతోషంగా ఉంది. తండేల్ కైనా లవ్ స్టోరీ కైనా నాకు కాంప్లిమెంట్స్ వచ్చినప్పుడల్లా నా కో - యాక్ట్రెస్ కి కూడా క్రెడిట్ ఇవ్వాలని చెప్తుంటాను ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఎనర్జీ ఆ సపోర్ట్ వల్లనే అలా పెర్ఫార్మ్ చేయగలిగామని అంటుంటాను. " అని రిలీజ్ కి ఉన్న మూవీస్ విషయంలో సాయి పల్లవికి విషెస్ చెప్పాడు నాగ చైతన్య.






