Home

»

Tv News

జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2... సాయి పల్లవితో సీజన్ స్టార్ట్

Oct 12, 2026 6:18PM

జీ తెలుగులో జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 1 సక్సెఫుల్ గా పూర్తి చేసుకుని ఇప్పుడు సీజన్ 2 లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక హోస్ట్ కూడా జగపతి బాబు ఉన్నారు. ఈ ప్రోమో రీసెంట్ గా రిలీజయ్యింది. ఇక ఫస్ట్ ఎపిసోడ్ కి "మన మనసుల్ని గెలుచుకున్న సాయి పల్లవి " అంటూ జగపతి బాబు ఆమెను ఇన్వైట్ చేశారు. "ఎలెక్ట్రిఫయింగ్ , సింపుల్  అండ్ ప్యూర్ పర్సనాలిటీ" అంటూ ఆమెను పొగిడేశారు. "ఫస్ట్ టైం కలుస్తున్నాం కదా మనం " అని జగ్గు భాయ్ అడిగేసరికి " "ఇంతకుముందు కాల్ లో మాట్లాడుకున్నాం " అని చెప్పింది సాయి పల్లవి.
"అమ్మా నమస్కారం ఆ మెమరీ వద్దు " అంటూ మాట దాటేసారు జగ్గూభాయ్.

"ఫిదా తర్వాత ఈ నేషన్ ఫిదా ఐపోయింది" అన్నారు . "ఇద్దరిలో ఎవరంటే భయం " అన్న ప్రశ్నకు  "అమ్మ నాన్నను చూస్తే కొంచెం భయం కానీ ఇప్పుడు వాళ్లకు నన్ను చూస్తే భయం " అని చెప్పింది. "ఎప్పుడన్నా ఒక క్రషో, ఒక ఫీలింగో " అనేసరికి సాయి పల్లవి సిగ్గుపడిపోయింది. తర్వాత ఎవరినో పిలిచాడు జగపతి బాబు . ఓ మై గాడ్ అంటూ షాకైపోయింది సాయి పల్లవి. ఇంతకు ఎవరు వస్తున్నారు అనేది సస్పెన్స్ లో ఉంచారు. ఇక ఈ సీజన్ 2 ప్రతీ ఆదివారం రాత్రి 7.30 కి టెలికాస్ట్ కాబోతోంది.

జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 1 లో మొత్తం 13 ఎపిసోడ్స్ టెలికాస్ట్ కాగా 14 వ ఎపిసోడ్ స్టార్స్ అందరివీ కలిపి ఒక ఎపిసోడ్ గా పెట్టారు. ఫస్ట్ ఎపిసోడ్ లో నాగార్జున, శ్రీలీలే, న్యాచురల్ స్టార్ నాని, రామ్ గోపాల్ వర్మ, మీనా-సిమ్రాన్ జోడి ఎపిసోడ్, తేజ సజ్జ, ప్రభుదేవా, నాగ చైతన్య, కీర్తి సురేష్, రామ్ పోతినేని, రమ్య కృష్ణ, దేవి శ్రీ ప్రసాద్, రష్మిక మందన్నా...వీళ్లందరితో చిట్ చాట్ చేశారు జగ్గు భాయ్.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com