.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం' . ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-409లో.. వంశీతో జయ బయటకు వెళ్లినందుకు ఇంట్లో గొడవ అవుతుంది. తనని విశ్వ తిడతాడు. ఎందుకిలా చేశావ్.. ఒక మాట నాకు చెప్పాలి కదా అని విశ్వ కోప్పడతాడు. ఆ తర్వాత సుధా కూడా కోప్పడుతుంది. దీనికి మంచి పని జరిగిందని లక్ష్మీ వాళ్లు అనుకుంటారు. మరోవైపు వంశీని ఇందుమతి తిడుతుంది. పెళ్లి కాకముందే బయటకు తీసుకెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అని కొడుతుంది.
గంగ రాకపోయి ఉంటే ఆ రౌడీలు మిమ్మల్ని ఏమైనా చేసి ఉంటే, ఫైట్ చేయకుండా ప్లీజ్ అంటూ బతిమిలాడుతున్నావ్.. నా పరువు పోయిందని వంశీతో ఇందుమతి అంటుంది. ఇక నువ్వు రేపటి నుంచి కరాటే నేర్చుకోమని చెప్తుంది. మరోవైపు ప్రీతి కొడుకు బారసాల ఏర్పాట్లు చేస్తారు. బాబు కోసం రుద్ర పది లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నాడని గంగ నోరు జారేస్తుంది. అప్పుడే రుద్ర డబ్బు తీసుకుని ఇంటికి వస్తాడు. ఎందుకు అన్నయ్య ఇప్పుడు అవన్నీ అని ప్రీతి అంటే అది నా బాధ్యత అని రుద్ర చెప్తాడు.
అలా అంటే తండ్రి ఒక చేతకాని వాడు అనుకోవాలి కదా అని వీరు అంటాడు. ఆ తర్వాత వీరుకి అప్పు ఇచ్చిన వ్యక్తి కాల్ చేసి.. రేపు డబ్బు ఇవ్వకపోతే ఇంటికి వచ్చి జరిగింది చెప్తానని బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఇస్తానని వీరు చెప్తాడు. మరోవైపు ఇంట్లో ఏ పని చేయడం లేదు, గంగకు హెల్ప్ చేయమని ఇషికకి ప్రమీల చెప్తుంది. అది ఇషిక మనసులో పెట్టుకుని బాబును ఆడిస్తున్న ప్రమీలను చూసి శకుంతలను పిలిచి.. బాబును తనకి ఎందుకు ఇస్తున్నారు.. అది బాబును గిచ్చింది.. అలాంటి వాళ్లకి అసూయ ఉంటుందని ఇషిక అనగానే శకుంతల నిజమే అనుకుని ప్రమీల దగ్గర ఉన్న బాబును తీసుకుని వెళ్లి ప్రీతికి ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
