.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -399 లో.. బాబుని కిడ్నాప్ చేసింది వీరూనే అని తెలుసుకున్న రుద్ర.. వీరుని కాళ్లు పైకి కట్టి కిందకు వేలాడదీస్తాడు రుద్ర. అయినా వీరు పొగరుగా మాట్లాడుతుంటే రుద్రకి కోపం వచ్చి రాయితో కొట్టబోయి ఆగిపోతాడు. తన చెల్లి, అల్లుడు మొహం చూసి వీరుని కొట్టకుండా ఉంటాడు రుద్ర. మరోవైపు ఇంకా వీరు బ్రో రాలేదని ఇషిక టెన్షన్ పడుతుంటే అప్పుడే రుద్ర, వీరు వస్తారు. కొంచెం వాళ్ల ముందు రౌడీలను కొట్టినట్లు యాక్టింగ్ చెయ్ అని వీరుకి రుద్ర చెప్తాడు.
జయకి విశ్వ బాక్సింగ్ నేర్పిస్తుంటాడు. అదే సమయంలో గంగ వచ్చి తనకి ఛాలెంజ్ విసిరినట్టుగా జయ భావిస్తుంది. వెంటనే ఫాస్ట్ గా కిక్ బాక్సింగ్ చేస్తుంటుంది జయ. వెంటనే విశ్వ స్టాప్ స్టాప్ అని అరుస్తాడు. వెంటనే తేరుకుంటుంది జయ. సారీ నాన్న గారు.. ఆ గంగ నా ఎదురుగా వచ్చి బాక్సింగ్ చేద్దామని అన్నట్టుగా ఇద్దరం తలపడ్డామని తన భ్రమ గురించి చెప్తుంది. అది విన్న విశ్వ.. సూపర్.. మన అపోనెంట్ మన ముందు ఉన్నాడని అనుకొని బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా గెలుస్తామని జయని విశ్వ పొగుడుతాడు. మరోవైపు సుధా కోసం పాయసం చేసి తీసుకెళ్తుంది గంగ. రుద్ర తనని కారులో తీసుకెళ్తుంటాడు.
ఇక వీరు ఇంట్లోనే ఒక దగ్గర ఉండి ఆలోచిస్తుంటే అక్కడికి ఇషిక వస్తుంది. ఏంటి బ్రో.. నువ్వే రౌడీలని పెట్టి, వాళ్ళని నువ్వే ఎందుకు కొట్టావని వీరుని పట్టుకోగానే అతనికి పెయిన్ వస్తుంది. నొప్పి అని వీరు అనగానే అదేంటి బ్రో.. రౌడీలని నువ్వే కొట్టి నువ్వే నొప్పి అంటున్నావని ఇషిక అడుగగా.. ఆ రౌడీలు రుద్రకి నిజం చెప్పేశారు. అందుకే నన్ను తీసుకెళ్ళి ఫుల్ గా కొట్టాడు. చివరికి చంపాలనుకొని, ప్రీతీ, బాబు మొహం చూసి ఆగిపోయడని, నాకు వార్నింగ్ ఇచ్చాడంటూ జరిగిందంతా ఇషికతో చెప్తాడు వీరు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






