Home

»

Tv News

Jayam Serial : కన్నకొడుకునే కిడ్నాప్ చేయించిన వీరు..రౌడీలు బయటపెట్టిన నిజం!

Oct 14, 2026 10:06AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం' (Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -398 లో వీరు తన కన్న కొడుకుని కిడ్నాప్ చేయించాడని రుద్రకి తెలుస్తుంది. నీ బాబుని కిడ్నాప్ చేయించిన రౌడీలు దొరికారు.. వాళ్ళని నువ్వే కొట్టాలని వీరుతో రుద్ర చెప్పి రౌడీల దగ్గరకు తీసుకొని వస్తాడు. ఆ రౌడీలను వీరు కొట్టి మా బాబునే కిడ్నాప్ చేస్తారా అని కొడుతాడు. దీంతో ఓ సర్ ఆల్రెడీ ఆ బాబుకి మీరే కిడ్నాప్ చేయించారని తెలిసిందని రౌడీలు చెప్పగానే వీరు షాక్ అవుతాడు.

మరోవైపు బాబుతో ప్రీతి ఆడుకుంటుంది. అప్పుడే గంగ, రంగా వస్తారు. బాబుని ఎవరో ఇంట్లో వాళ్లే కావాలని కిడ్నాప్ చేసి ఉంటారని గంగ అంటుంది. అంటే విశ్వ మావయ్యనా అని ప్రీతి అడుగుతుంది. ఛ ఆయన అలాంటి వారు కాదని గంగ అంటుంది. ఇంటి దొంగని ఈశ్వరుడు అయినా పట్టలేడని గంగ అంటుంది. అయిన వీరు అన్నయ్య రౌడీలను కొట్టాలని రుద్ర సర్ తీసుకెళ్లాడు కదా చూద్దామని గంగ అంటుంది. అవును రుద్ర బావ వాళ్ళని వదిలిపెట్టడని రంగా అంటాడు.

మరోవైపు వీరుని కాళ్లు పైకి కట్టి కిందకు వేలాడదీస్తాడు రుద్ర. అయినా వీరు పొగరుగా మాట్లాడుతుంటే రుద్రకి కోపం వచ్చి రాయితో కొట్టబోయి ఆగిపోతాడు. తన చెల్లి, అల్లుడు మొహం చూసి వీరుని కొట్టకుండా ఉంటాడు రుద్ర. మరోవైపు ఇంకా వీరు బ్రో రాలేదని ఇషిక టెన్షన్ పడుతుంటే అప్పుడే రుద్ర, వీరు వస్తారు. కొంచెం వాళ్ల ముందు రౌడీలను కొట్టినట్లు యాక్టింగ్ చెయ్ అని వీరుకి రుద్ర చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com