.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -395 లో బాబు కిడ్నాప్ అయిన విషయాన్ని రుద్రకి గంగ చెప్తుంది. బాబు కిడ్నాప్ అయ్యాడని తెలిసి ప్రీతి షాక్ లో ఉంటుంది. శకుంతల ఏడుస్తుంది. వాళ్లు ఎలా ఉన్నారని శకుంతల అడగ్గా వాళ్లు మాస్క్ పెట్టుకున్నారని గంగ అంటుంది. దీంతో శకుంతల తన చెంప చెల్లుమనిపిస్తుంది. అసలు విషయం తెలియకుండా గంగని కొట్టడం వల్ల లాభం ఏంటని రుద్ర అంటాడు.
బాబు కోసం ఇంట్లో అందరు ఆందోళనలో ఉంటారు. మరోవైపు నేను చెప్పినట్లు ఫోన్ చేసి మాట్లాడండని రౌడీలతో వీరు ఫోన్ లో మాట్లాడతాడు. బాబు జాగ్రత్త అని వీరు చెప్తాడు. ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఇషిక వింటూ ఉంటుంది. ఏంటి బ్రో నువ్వే కిడ్నాప్ చేయించావా అని ఇషిక అడుగుతుంది. మరి ఏం చెయ్యాలి ఆ బెట్టింగ్ యాప్ వాళ్లు మనల్ని డబ్బు ఇవ్వమని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు .. ఇక తప్పలేదని వీరు అంటాడు. అయినా కన్నకొడుకుని అలా ఎవరైనా చేస్తారా అని ఇషిక అనగానే సెంటిమెంట్ ఉంటే అన్నీ చెయ్యలేమని వీరు అంటాడు. వీరు నిజస్వరూపం తెలిసి ఇషిక షాక్ అవుతుంది.
ఆ తర్వాత రుద్ర వాళ్లు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంటే కిడ్నాపర్ ఫోన్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేస్తాడు. దీంతో శకుంతల వాళ్లు డబ్బు ఇవ్వాలని అనుకుంటారు కానీ రుద్ర ఆపి నేను సేఫ్ గా బాబుని తీసుకొని వస్తానని చెప్తాడు. ఆ తర్వాత గంగ, రంగా, రుద్ర కలిసి ఒక ప్లాన్ చేస్తారు. రుద్ర తనకి తెలిసిన వాళ్లకి ఫోన్ చేస్తాడు. నా దగ్గర డబ్బు ఉంటే ఇలా నా బాబుని కాపాడుకునే వాడినని వీరు యాక్టింగ్ చేస్తాడు. బాబును రుద్ర కాపాడతాడా, వీరు నాటకం బయటపడుతుందా అనేది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






