Home

»

Tv News

 బాబుని ఎత్తుకెళ్లిన రౌడీలు.. విశ్వ, రుద్ర మధ్య మాటల యుద్ధం !

Oct 9, 2026 10:41AM

 

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-394లో వీరు ఒక ప్లాన్ వేస్తాడు. రౌడీలకీకి వీరు ఫోన్ చేసి బాబుని ఒకావిడ ఎత్తుకొని వస్తుంది.. రాగానే తీసుకొని వెళ్లండి అని చెప్తాడు. బాబు ఏడుస్తుంటే నేను ఆడిస్తానని గంగ బయటకు ఎత్తుకొని వెళ్తుంది. అప్పుడే రంగాకి బాబుని ఇచ్చి గంగ కిచెన్ లోకి వెళ్తుంది.  బాబుని రంగా ఆడిస్తుంటే అప్పుడే రౌడీలు వచ్చి బాబుని ఎత్తుకొని వెళ్తారు. అప్పుడే గంగ బయటకు వస్తుంది. రౌడీలని చూసి.. ఎవడ్రా మీరు అంటూ గంగ వాళ్ల వెంబడి పరిగెడుతుంది.

మరోవైపు ప్రీతి , వీరుల బాబు బారసాలకి విశ్వని పిలవడానికి రుద్ర, శకుంతల, పెద్దసారు కలిసి వెళ్తారు. పెద్దసారుని చూసి సుధా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మా అత్తయ్య, మావయ్యకి కాఫీ తీసుకొని వస్తానని జయ వెళ్తుంది. జయ కాఫీ చేస్తుంటే రుద్ర వెళ్లి పెద్దనాన్నకి షుగర్ తక్కువ వెయ్, నువ్వు మా పెద్దమ్మని ఇంప్రెస్ చెయ్యాలి అనుకుంటున్నావ్ కదా.. కావాలంటే తనకి షుగర్ ఎక్కువ వెయ్ అని రుద్ర అంటాడు. ఇద్దరు మాటలతోనే యుద్ధం చేసుకుంటారు.

ఆ తర్వాత ఆ కాఫీ తాగి పెద్దసారు బాగుందని చెప్తాడు. చూసావా జయ, నేను చెప్పినట్లు చేస్తే ఏదైనా పర్ఫెక్ట్, అది కాఫీ అయినా ఫ్యూచర్ అయినా అని రుద్ర అనగానే అది వార్నింగ్ లాగా ఉందని విశ్వ అంటాడు. మీకు ఇంకా అర్థం కాలేదా నాన్నా, గంగతో పోటీ వద్దు, ఓడిపోతావని ఇండైరెక్ట్ గా అంటున్నాడని విశ్వని జయ రెచ్చగొడుతుంది.

దాంతో విశ్వ కోపంగా నా కూతురు జయనే గెలుస్తుందని వాదిస్తాడు.. గొడవ పెద్దది అవుతుందేమోనని సుధా భయంతో టాపిక్ డైవర్ట్ చేస్తుంది. అయినా విశ్వ డైవర్ట్ కాడు..‌నాకు జయనే గెలుస్తుంది అనిపిస్తుందని శకుంతల అనగానే ఎవరు కష్టపడితే వాళ్లకి ఫలితం దక్కుతుందని పెద్దసారు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com