
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం Jayam .ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ 367 లో గంగ స్పాన్సర్ అగ్రిమెంట్ దగ్గరికి రాకపోవడానికి కారణం తను తాగిన పాలలో ఎవరో స్లీపింగ్ టాబ్లెట్ కలిపారని అది ఈ ఇంట్లో వాళ్లే అని వీరు, ఇషికపై అనుమానంగా చూస్తాడు రుద్ర. దాంతో శకుంతల వాళ్లపై డౌట్ రాకుండా కవర్ చేస్తుంది. రుద్ర నువ్వు అలా అనడం కరెక్ట్ కాదని సుధా అంటుంది. ఏదైనా త్వరలోనే తెలుస్తుంది అత్తయ్య అని రుద్ర అంటాడు.
ఆ తర్వాత రుద్ర దగ్గరికి గంగ వచ్చి హగ్ చేసుకొని.. మీరు నన్ను అర్థం చేసుకుంటారని అనుకోలేదు సర్, చాలా థాంక్స్ అంటుంది. నిజానికి నీకే సారీ చెప్పాలి.. నిన్ను అపార్థం చేసుకున్నానని రుద్ర అంటాడు. మీరు నాకు సారీ చెప్పడం ఏంటని గంగ అంటుంది. చూసావా చెల్లీ, బావ ఎంత సైలెంట్ గా ఉన్నా అన్నీ కనిపెడతాడని రంగా అంటాడు.
ఇంతకీ ఎవరు కలిపారని గంగ అడిగితే ఇంకెవరు, ఆ ఇషిక - వీరే" అని రుద్ర చెప్తాడు. ప్రీతి డెలివరీ అవనివ్వు, అప్పుడు చెప్తా వాళ్ల సంగతి అని రుద్ర అంటాడు. ఈ రోజు ఆ జయ భాగోతం కూడా బయటపడేది.. ఆ వార్డెన్ హ్యాండ్ ఇచ్చిందని రంగా అనగానే వార్డెన్ ఏంటని రుద్ర అడుగుతాడు. దాంతో.. వార్డెన్, జయ మాట్లాడుకున్నది చూసి నేను వెళ్లి వార్డెన్ తో మాట్లాడాను. ఆమె నిజం చెప్తానని అంది. టైంకి వచ్చాక చెప్పలేదని రంగా అంటాడు. నువ్వు వాళ్లని ఫాలో అవ్వు అని రంగాకి రుద్ర చెప్తాడు.మరోవైపు స్నేహని తన ఫ్రెండ్ డబ్బు కావాలని బ్లాక్ మెయిల్ చేస్తాడు. స్నేహ టెన్షన్ పడుతుంటే గంగ చూసి.. ఏమైందని అడుగుతుంది. ఏం లేదని స్నేహ మాట దాటేస్తుంది. దాంతో గంగ, రంగాలకి డౌట్ వస్తుంది. ఆ తర్వాత స్నేహని తన ఫ్రెండ్స్ కొందరు ఏడిపిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





(4).webp)
