Home

»

Tv News

జయ తీరుపై విశ్వ ఫైర్.. గంగకి సారీ చెప్పిన గురువు!

Oct 3, 2026 9:47AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సూపర్ హిట్ సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ - 389..పైడిరాజు, లక్ష్మి ఇద్దరిని జయ ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని చెప్తుంది. అప్పుడే గంగ, రుద్ర వచ్చి.. ఇక్కడ ఉంటే ఈ జయ మిమ్మల్ని అవమానిస్తుంది, మీరు మాతో రండి అని పైడిరాజు, లక్ష్మి ఇద్దరిని రుద్ర ఇంటికి తీసుకెళ్లబోతుంటే సుధా, విశ్వ వస్తారు.

ఎక్కడికి వెళ్తున్నారని విశ్వ అడగగా జయకి వాళ్లు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు.. అందుకే వెళ్లిపొమ్మందని రుద్ర అంటాడు.వెంటనే విశ్వ కోపంగా జయని పిలిచి.. ఎందుకు వాళ్లని వెళ్లమన్నావని నిలదీస్తాడు. దానికి జయ.. వాళ్ల కూతురు గంగ గెలవాలని ఆలోచించి నాకు ప్రాపర్ డైట్ ఇవ్వట్లేదని అంటుంది. అబద్ధం చెప్పకండి అమ్మా అని లక్ష్మి అంటుంది. అవును వాళ్లు కరెక్ట్ గానే చేస్తున్నారు..‌ నన్ను అడిగే చేస్తున్నారని సుధా కూడా జయని తప్పుపడుతుంది. నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావ్.. వాళ్లు అలాంటి వాళ్లు కాదు..‌వాళ్లకి సారీ చెప్పమని విశ్వ అనగానే జయ పైడిరాజు, లక్ష్మికి సారీ చెప్తుంది. మీరు లోపలికి వెళ్లండి అని విశ్వ వాళ్లని పంపిస్తాడు. ఆ తర్వాత గంగ, రుద్ర వెళ్తుంటే.. జయ తరపున నేను సారీ చెప్తున్నానని విశ్వ అంటాడు.

ఆ తర్వాత రుద్ర, విశ్వ బాక్సింగ్ పోటీ గురించి మాట్లాడుకుంటారు. మరోవైపు వీరు, ఇషిక ఇంటికి వస్తారు. ఎక్కడికి వెళ్లారని శకుంతల అడగగా జరిగిందంతా వీరు చెప్తాడు. ఆ బాలకృష్ణ స్పృహలోకి వస్తే గంగ గురించి తెలుస్తుందని శకుంతల అనగానే అప్పుడే పెద్దసారు వచ్చి.. ఏం తెలుస్తుందని అంటాడు. దీంతో వీరు, ఇషిక ఆ మాటను డైవర్ట్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com