.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్- 413 లో ప్రీతీ, వీరుల బాబు బారసాలకు అందరు వస్తారు. విశ్వ ఫ్యామిలీతో వస్తాడు. కిచెన్‌లో ఉన్న లడ్డుని గంగ చూసి తినబోతుంటే అప్పుడే రుద్ర వచ్చి ఆపుతాడు. అన్ని తిని లావు అవుతావా అని క్లాస్ తీసుకుంటాడు రుద్ర. అప్పుడే పెద్దసారు వచ్చి గంగకి సపోర్ట్‌గా మాట్లాడతాడు. మరోవైపు బాబుకి పేరు పెట్టండి అని పంతులు అంటాడు.
బాబుకి తనకి ఇష్టమైన పేరుని వీరు పెడతాడని పెద్దసారు అంటాడు. విజయేంద్ర ప్రతాప్, నువ్వు మా నాన్నని మోసం చేశావని మనసులో అనుకొని ఏదో పేరు చెప్పబోతుంటే, ఆయన ఏం చెప్తారు నా ఇష్టం అంటారు.. అందుకే అన్నయ్య నువ్వు చెప్పమని రుద్రని పేరు పెట్టమని ప్రీతీ చెప్తుంది. దాంతో వీరుకి కోపం వస్తుంది. బావగారు పెడితే పేరు చివరన ప్రతాప్ వచ్చేలా పెడతారు.. బాబు మన ఇంటికి వారసుడు కాదు కదా అని ఇషిక అనగానే, నువ్వేం టెన్షన్ పడకు, అలా పెట్టకుండా కూడా పేరు పెట్టొచ్చని గంగ కౌంటర్ వేస్తుంది.
ఆ తర్వాత బాబు పేరు భానుకిరణ్.. భాను మళ్లీ మన మధ్యకు రావాలని ప్రీతీ కడుపులో పుట్టాడని రుద్ర అంటాడు. భాను పేరు వినగానే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత గంగ, నువ్వు వెళ్లి నిన్న తీసుకొని వచ్చిన డబ్బు తీసుకొని రా అని రుద్ర అనగానే గంగ వెళ్తుంది. గంగ వెళ్లి చూసేసరికి ఆ డబ్బు ఉండదు. అదే విషయం వచ్చి ఇంట్లో వాళ్లకి చెప్తుంది. రుద్ర బావకి డబ్బు ఇవ్వాలని ఉంది కానీ గంగకి ఇష్టం లేదని వీరు అంటాడు.
ఒకసారి నేను వెళ్లి చూసి వస్తానని రుద్ర గదిలోకి వెళ్తాడు. అసలు డబ్బు తీసింది ఈ వీరు, ఎవరికో ఇవ్వడం నేను చూశానని రంగా అనగానే, ఏంటి రంగా ఎవరిపై నిందలు వేస్తున్నావని శకుంతల కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
