Jayam Serial : అల్లుడి నుంచి వియ్యంకుడిగా మారిన విశ్వ.. ప్రమీలని కాపాడిన కార్తీక్!
.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం' (Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ - 411 లో బారసాల ఫంక్షన్ హైలైట్ అయింది. ఇంట్లో బారసాల ఫంక్షన్ కి అందరు వస్తారు. విశ్వ లోపలికి వెళ్తుంటే సుధ ఆశ్చర్యంగా చూస్తుంది. ఏమైందని విశ్వ అడుగుతాడు. మా వాళ్ళు మీకు ఎదురుగా వచ్చి ఆహ్వానిస్తే వస్తారు కదా, అలాంటిది డైరెక్ట్ లోపలికి వెళ్తున్నారని అనగానే అప్పుడు నేను ఈ ఇంటికి అల్లుడిని, ఇప్పుడు నేను ఈ ఇంటికి వియ్యంకుడిని, ఆడపిల్లకి తండ్రిని అని విశ్వ అనగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు.
విశ్వ లోపలికి వెళ్ళగానే అందరు పలకరిస్తారు. అక్కడ గంగ రౌడీలను కొట్టి వంశీ, జయను సేవ్ చేసినందుకు గంగ గురించి గొప్పగా మాట్లాడుతారు. పైడిరాజు, లక్ష్మి గురించి శకుంతల తక్కువ చేసి మాట్లాడుతుంటే వాళ్ళు మా లాగా వియ్యంకులే, వాళ్ళకి మాకు సమానంగా విలువ ఉండాలని విశ్వ అంటాడు. ఆ తర్వాత ఇక్కడ ప్రమీల కనిపించడం లేదని విశ్వ అంటాడు. అమ్మగారు నిన్న అన్న మాటలకి అక్క బయటకు వెళ్లినట్లు ఉందని గంగ అంటుంది. ఏం అందని పెద్దసారు అడుగుతాడు. ఏం అన్నా, రేపు అందరు చుట్టాలు వస్తారు.. నువ్వు బయటకు రావద్దని చెప్పానని శకుంతల అంటుంది. ఎందుకు తక్కువ చేసి మాట్లాడుతారంటూ అందరు శకుంతలపై కోప్పడుతారు.
మరోవైపు శకుంతల అన్న మాటలకు ప్రమీల బాధపడుతూ నడుచుకుంటూ వెళ్తుంటే కార్ డాష్ ఇవ్వబోతుంటే కార్తీక్ వచ్చి తనని పక్కకి లాగుతాడు. ఏమైంది అండి అలా ఉన్నారు.. ఇంట్లో ఫంక్షన్ కదా మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారని కార్తీక్ అడుగుతుంటే ప్రమీల ఏడుస్తుంది. మరోవైపు గంగ, రుద్ర ఇద్దరు కలిసి ప్రమీలను వెతుకుతుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
