.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-407 లో.. కోమాలో ఉన్న బాలకృష్ణని చూడటానికి పెద్దసారు, శకుంతల, గంగ రాగానే రుద్ర సీరియస్ అవుతాడు. మీరెందుకు వచ్చారని పెద్దసారు వాళ్ళని రుద్ర అడుగగా మేము రాకూడదా అని శకుంతల అంటుంది. శకుంతల కవర్ చేస్తుంది. మరోవైపు బాలకృష్ణని చంపడానికి వీరు గన్ తో షూట్ చేయాలని అనుకుంటాడు. కానీ కుదరదు. ఇక బయట వెళ్ళి ఒక చెట్టు దగ్గర నిల్చొని ఉండగా రుద్ర చూస్తాడు.
వీరూలా ఉన్నాడని చూడగా టాటూ చూసి వీరు అని కన్ఫమ్ చేసుకుంటాడు రుద్ర. వెంటనే అతని చెట్టు మీద ఉన్న తేనెటీగలు చూసి ఆపిల్ తో కొడతాడు. దాంతో అవన్నీ వీరుని కుడతాయి. దాంతో అతను సర్దార్ గెటప్ మొత్తం పోతుంది. ఇక అదంతా పైనుండి రంగ, గంగ చూస్తారు. ఇక వెంటనే వీరు ఇంటికి వస్తాడు. మరోవైపు శకుంతల, పెద్దసారు, రుద్ర, గంగ అందరు ఇంటికి వెళ్తారు.
ఎక్కడికి వెళ్ళారని ప్రీతి వాళ్లు అడుగగా.. శకుంతల, పెద్దసారు కవర్ చేస్తారు. రుద్ర టైర్డ్ గా ఉందని చెప్పి తన గదిలోకి వెళ్తాడు. అప్పుడే కాఫీ తీసుకొని వస్తుంది గంగ. అది చూసి ఆ కాఫీ నీ మీద పోసుకో అని కోపంగా గంగ మీద అరుస్తాడు రుద్ర. ఏంటండి ఏమైందని గంగ అడుగగా.. నీ మొహం అయిందని అంటాడు. శకుంతల పెద్దసారు వాళ్ళని ఎందుకు తీసుకొచ్చావని గంగ మీద రుద్ర సీరియస్ అవుతాడు. పెద్దసారు బలవంతం చేశారని గంగ చెప్పగానే అక్కడికి వీరు వచ్చాడని రుద్ర చెప్పగానే గంగ షాక్ అవుతుంది. నేను మాట్లాడేటప్పుడు ఇంట్లో ఎవరు లేరని గంగ చెప్పగా వాడు ఏదో మూలన దాక్కొని విని, డ్రైవర్ సర్దార్ జీ గెటప్ లో వచ్చాడని రుద్ర అనగానే గంగ షాక్ అవుతుంది. ఆ తర్వాత బాలకృష్ణ ప్లేస్ ని మార్చేశామని, ఇంకెప్పుడు గంగతో ఈ విషయం చెప్పకూడదని అనుకుంటారు. ఆ తర్వాత వీరు దగ్గరికి శకుంతల వెళ్తుంది. మన ప్లాన్ ఇలా తెలిసిపోయిందని శకుంతల అంటుండగా అక్కడికి రుద్ర రావడం గమనించి మాట మారుస్తుంది శకుంతల. తర్వాత వీరు, రుద్ర మధ్య మాటల యుద్ధం మొదలవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
