.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-404 లో.. గంగ గురించి సుధా తన గదిలో బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తుంటుంది. అదే సమయంలో అక్కడికి జయ వస్తుంది. అమ్మ నన్ను క్షమించు.. ఆ గంగ నా కన్నా బాగా ఆడి, నా మీద గెలుస్తుందేమోననే ఇదంతా చేశాను.. సారీ అమ్మ.. ఇంకెప్పుడు ఇలా చేయను అమ్మ.. నన్ను క్షమించు అమ్మ అంటు సుధా కాళ్ళ మీద పడుతుంది జయ. నువ్వు ఇలా తప్పు చేశావని మీ నాన్నకి తెలిస్తే ఎప్పటికీ క్షమించడు అని సుధా అంటుండగా అప్పుడే అక్కడికి విశ్వ వస్తాడు.
ఏంటా తప్పు అని విశ్వ ఎంట్రీ ఇస్తాడు. అదేం లేదు.. తను డైట్ స్కిప్ చేసింది.. ఐస్ క్రీమ్ తిన్నదని సుధా కవర్ చేస్తుంది. ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది. ఆ తర్వాత ప్రాక్టీస్ మిస్ చేస్తావ్.. జ్వరం వస్తుందని విశ్వ అనగానే సారీ నాన్న ఇంకెప్పుడు డైట్ మిస్ చేయనని జయ అనగానే సరే అని విశ్వ అంటాడు. ఇంకెప్పుడు నా దగ్గర ఏదీ దాచొద్దని సుధాతో విశ్వ అంటాడు. మరోవైపు గంగ ప్రాక్టీస్ చేస్తుంటే తనని డిస్టబ్ చేయడానికి వీరు, ఇషిక ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకుంటారు. గంగకి రుద్ర ట్రైనింగ్ ఇస్తుంటే వీరు, ఇషిక మాటలతో గంగని రెచ్చగొడతారు. దాంతో తన ఏకాగ్రత మిస్ అవుతుంది. అది గమనించిన రుద్ర.. గంగకు ఒక పంచ్ ఇవ్వగానే తను పడిపోతుంది. నిన్ను టిస్టబ్ చేయడానికి ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు వాటిని నువ్వు పట్టించుకుంటూ ఉంటే నీ గేమ్ లో నువ్వు ఓడిపోయతావని తిడతాడు. అప్పుడే శకుంతల వస్తుంది. అనువుగాని చోట మనం అధికులమనరాదు అని చెప్తుంది శకుంతల. మనది కానీ దగ్గర గెలవాలని ప్రయత్నించకూడదు.. విశ్వ కూతురు జయ.. బాక్సింగ్ తన బ్లడ్ లోనే ఉంది.. నీ గురించి చెప్పక్కర్లేదనుకుంటానని సూటిపోటీలతో గంగని బాధపెట్టి వెళ్ళిపోతుంది శకుంతల. దాంతో గంగ బాధపడుతుంది. అదంతా పెద్దసారు గమనిస్తాడు.
మరుసటి రోజు గంగ కిచెన్ లో వంట చేస్తుంటే అదే సమయంలో జయ ఇంటికి వస్తుంది. అందరిని మంచిగా పలకరించి మార్కులు కొట్టేయాలని చూస్తుంది. బాగా ప్రాక్టీస్ చేస్తున్నానని మామయ్య అని జయ అనగానే మంచిగా గుర్తుచేశావమ్మా.. నేను దానిగురించే మాట్లాడుదామని అనుకున్నానని పెద్దసారు అంటాడు. ఇందులో మూడు గంగ , మూడు జయ పేరుతో రాసి ఉన్న చీటీలు ఉన్నాయి. వీటిని నా మనవడితో తీయిస్తాను.. ఎవరి పేరు వస్తుందో వారే గెలుస్తారని పెద్దసారు అనగానే ఈ కాలంలో కూడా ఈ సెంటిమెంట్స్ నిజనవుతాయా అని జయ అనగానే నా సెంటిమెంట్ ఇది.. ప్రతీసారీ నిజమవుతుందని పెద్దసారు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





