Home

»

Tv News

రౌడీలతో మాస్టర్ ప్లాన్ చేసిన వీరు.. గంగ ఏం చేయనుంది!

Oct 8, 2026 10:40AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -393 లో విశ్వ చైన్ ని దొంగ తీసుకొని వెళ్తే గంగ దొంగని కొట్టి చైన్ తీసుకొని వచ్చినందుకు గంగకి సుధా ఫోన్ చేసి మాట్లాడుతుంది. అలా చాలా రోజుల తర్వాత గంగకి ఫోన్ చేసి ప్రేమగా మాట్లాడుతుంటే గంగ మురిసిపోతుంది. ఆ విషయం రుద్రకి చెప్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. గంగతో సుధ ఫోన్ లో మాట్లాడడం పైడిరాజు, లక్ష్మి విని ఈ తల్లీకూతుళ్లను ఎలాగైనా ఒకటి చేయాలని అనుకుంటారు.

గంగతో సుధా ప్రేమగా మాట్లాడడం జయ చూస్తుంది. అమ్మో వీళ్లకి గంగ అంటే కోపం కలిగేలా చేశాను కానీ తనంటే అభిమానం అయితే ఉందని అనుకుంటుంది. ఆ తర్వాత వంశీని నా ప్రేమతో కట్టిపడేయాలని తనకి ఫోన్ చేసి నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నాకు గుర్తు వస్తున్నావ్ నీకు నేను ఇష్టం లేదా గుర్తు రావడం లేదని అంటుంది దీంతో తనకి నేనంటే ఎంత ఇష్టమని వంశీ మురిసిపోతాడు.

ఆ తర్వాత రుద్ర, శకుంతల, పెద్దసారు ముగ్గురు కలిసి విశ్వ ఇంటికి వస్తారు. జయ నువ్వు ఎలాగైనా గెలవాలని శకుంతల అనగానే జయ గెలిస్తే రుద్ర ఓడిపోయినట్లే కదా అని విశ్వ అంటాడు‌. అంత మన ఫ్యామిలీ కదా ఎవరు గెలిస్తే ఏంటి ఎవరు ఓడిపోతే ఏంటని శకుంతల అంటుంది. మావయ్య నా మేనల్లుడు బారసాల ఫంక్షన్ కి పిలవడానికి వచ్చామని రుద్ర అనగానే సరే లోపలికి రండి అని విశ్వ అంటాడు.

మరోవైపు వీరు ఒక ప్లాన్ చేస్తాడు. రౌడీలకు ఫోన్ చేసి బాబు బయట ఉన్నప్పుడు ఎత్తుకొని వెళ్లండి అని వాళ్లకి చెప్తాడు. బాబు ఏడుస్తుంటే ప్రీతి ఎత్తుకుంటుంది. అప్పుడే వీరు వస్తాడు. తరువాయి భాగంలో రంగా బాబుని ఆడిస్తుంటే రౌడీలు వచ్చి బాబుని తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com