Home

»

Tv News

Jayam : జయ వర్సెస్ గంగ.. గంగని మెచ్చుకున్న విశ్వ!

Oct 7, 2026 10:26AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం' . ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-392లో.. జయ ప్రాక్టీస్ లో భాగంగా పంచ్ బ్యాగ్ ని పగలగొడుతుంది.. తన కాన్ఫిడెన్స్ చూసి విశ్వ మురిసిపోతాడు. అది చూసిన గంగ.. విశ్వ సర్ ట్రైనింగ్ లో జయ ప్రాక్టీస్ చాలా బాగా చేస్తుందని రుద్రతో అంటుంది. నువ్వు కూడా చేయాలి.. ఆ బ్రిక్స్ ని పగలగొట్టాలని రుద్ర గంగలో కాన్ఫిడెన్స్ నింపుతాడు. దీంతో గంగ కూడా ఆ బ్రిక్స్ ని పగలగొడుతుంది. అది చూసిన విశ్వ గ్రేట్ అని గంగను మెచ్చుకుంటాడు.. అలా విశ్వ అనడం విన్న  జయ ఓర్వలేకపోతుంది.

ఆ తర్వాత విశ్వ వెళ్తుంటే పక్కన దొంగ వచ్చి తన మెడలోని చైన్ లాక్కొని పారిపోతాడు. అది రుద్ర, గంగ చూసి విశ్వ దగ్గరకు వస్తారు. జయ అతన్ని పట్టుకోమని విశ్వ అంటాడు.‌దొంగని జయ వెంబడిస్తుంది. కానీ ఆ దొంగ కత్తి చూపించి జయ మెడలో ఉన్న చైన్ కూడా లాక్కుంటాడు. జయ తిరిగి వచ్చి అదే విషయం చెప్తుంది. పోతే పోనివ్వండి నాన్న అని జయ అనగానే ఆ చైన్ నాకు చాలా విలువైనది.. అది సుధ, నా పెళ్లికి గుర్తు అని విశ్వ ఎమోషనల్ గా అంటాడు.

విశ్వ ఎమోషనల్ అవ్వడం చూసిన గంగ వెంటనే వెళ్లి ఆ దొంగను కొట్టి చైన్ తీసుకొని వస్తుంది. దీంతో గంగను విశ్వ మెచ్చుకుంటాడు. ఎందుకు ఇంత రిస్క్ చేశావని అడిగితే మీరు ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు కదా అందుకే అని గంగ చెప్తుంది. గంగ ధైర్యం చూసి అందరు ఆశ్చర్యపోతారు. జయ మాత్రం గంగకు వస్తున్న పేరు చూసి జెలస్ గా ఫీల్ అవుతుంది.

ఆ తర్వాత అక్కడికి మీడియా వాళ్లు వచ్చి వాళ్ల ప్రాక్టీస్ గురించి మాట్లాడుతారు. జయ ట్రైనింగ్ గురించి, గంగ ట్రైనింగ్ గురించి అడుగుతారు. గంగ చాలా కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతుంది.. విశ్వ గురించి రుద్ర గొప్పగా మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com