Home

»

Tv News

Jayam Serial :పెద్దసారు హ్యాపీ డాన్స్.. రుద్ర ఎమోషనల్ సీన్!

Sep 30, 2026 10:13AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతోంది. మంగళవారం నాటి ఎపిసోడ్   386 లో పెద్దసారు తన గదిలో హ్యాపీగా డాన్స్ చేస్తుంటాడు. అప్పుడే గంగ అక్కడికి వచ్చి "ఏంటి పెద్దోరు ఇంత హ్యాపీగా డాన్స్ చేస్తున్నారు?" అని అడుగుతుంది. దానికి పెద్దసారు "రుద్ర ఏ తప్పు చెయ్యలేదని తిరిగి తీసుకొని వచ్చారు కదా.. అందుకే హ్యాపీగా ఉన్నాను. వాడు ఎప్పుడూ నా నమ్మకాన్ని పోగొట్టలేదు" అని ఫీల్ అవుతాడు.

 

"ఎందుకు పెద్దోరు.. సర్ అంటే అంత ఇష్టం?" అని గంగ అనగానే "వాడికి కూడా నేనంటే బాగా ఇష్టం" అని పెద్దసారు అంటాడు. ఈ హ్యాపీనెస్ లో "నాకు స్వీట్ తీసుకొని రా" అని పెద్దసారు అనగానే గంగ స్వీట్ తీసుకొని వస్తుంది. పెద్దసారు తినబోతుంటే అప్పుడే రంగా వచ్చి ఆపుతాడు. అయినా సరే పెద్దసారు నోట్లో వేసుకుంటాడు. అప్పుడే రుద్ర వస్తాడు. పెద్దసారు నోట్లో సున్నుండ వేసుకొని సైలెంట్ గా ఉంటాడు. దాంతో రుద్ర పెద్దసారు ముక్కు మూయగానే స్వీట్ నోట్లో నుంచి కింద పడేస్తాడు.

 

గంగ, రంగా ఇద్దరూ చేస్తున్నది స్కామా అని రుద్ర ఫైర్ అవుతాడు. "పెద్దనాన్న నీ ఇంట్లో నువ్వు ఇలా భయపడి తినడం ఏంటి?" అని రుద్ర అంటాడు. "పెద్దనాన్నకి స్వీట్ ఇవ్వండి" అని రుద్ర అనగానే గంగ ఇస్తుంది. రుద్రని పెద్దసారు హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతాడు. ఈ సీన్ మొత్తాన్ని దూరం నుంచి శకుంతల చూస్తూ రగిలిపోతుంది.

 

 మరోవైపు వీరు తాను పంపిన మనుషులకి ఫోన్ చేస్తుంటే అప్పుడే రుద్ర వచ్చి ..‌ఆ ఫోన్ కలవదు, వాళ్ళు లిఫ్ట్ చేయరని అంటాడు. వాళ్ళు నువ్వు పంపిన మనుషులని నాకు అర్థమైందని రుద్ర అనగానే "తెలిసిపోయిందా" అని వీరు షాక్ అవుతాడు. ఆ తర్వాత ప్రీతి వాళ్ళ బాబుని రంగా ఆడిస్తుంటే శకుంతల వచ్చి కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com