Home

»

Tv News

Jayam Serial : డూప్లికేట్ పోలీసులకు బుద్ధి చెప్పిన రుద్ర.. గంగ టెన్షన్!

Sep 29, 2026 9:48AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం సోమవారం నాటి ఎపిసోడ్ 385 లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. వీరు పంపిన మనుషులు పోలీస్ గెటప్ లో వచ్చి బాలకృష్ణను కిడ్నాప్ చేశాడని రుద్రను అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. దీంతో గంగ టెన్షన్ పడుతుంది. మర్యాదగా అడుగుతున్నాం, ఇలా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తే మీ పరువు పోతుంది. ఆ బాలకృష్ణను కిడ్నాప్ చేసి ఎక్కడ దాచావో చెప్పమని పోలీసులు అంటారు. సరే చెప్తానని రుద్ర ఒక అడ్రస్ చెప్పి అక్కడికి తీసుకెళ్తాడు.

 

అక్కడ ఏమీ ఉండదు. ఏంటి పోలీసులతో నాటకాలా అని పోలీసులు అనగానే ఇక్కడ పోలీసులు ఎవరున్నారు.. నాకు తెలుసు మీరు పోలీసులు కాదని అని రుద్ర అంటాడు. దీంతో వాళ్లు షాక్ అవుతారు. వెంటనే వాళ్లకు రుద్ర బుద్ధి చెప్తాడు. ఇప్పుడు నన్ను ఎలా తీసుకొచ్చారో మర్యాదగా మళ్లీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి రండి అని రుద్ర అనగానే వాళ్లు రుద్రను తీసుకుని ఇంటికి వెళ్తారు. మేం రుద్ర గారిని తప్పుగా అర్థం చేసుకున్నామని వాళ్లు అనగానే వీరు షాక్ అవుతాడు.

 

ఏంటి మీరు ఇందాక ఇలా అంటున్నారు.. ఇప్పుడు ఇలా అంటున్నారని వీరు అనగానే.. ఏంటి అన్నయ్య, సర్ ని అరెస్ట్ చేయలేదని డిస్సపాయింట్ అయినట్లు ఉన్నారని గంగ కౌంటర్ వేస్తుంది. దీంతో ఆ డూప్లికేట్ పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఏంటి వీరు ఇప్పటికైనా నీ డౌట్ క్లియర్ అయిందా.. నేను తప్పు చేయలేదు బయటకు వచ్చాను. అలాగే నువ్వు బాలకృష్ణ విషయంలో తప్పు చేయకుంటే నాలాగే కేసు నుంచి బయట పడతావని రుద్ర అంటాడు.

 

ఆ తర్వాత గంగ వెళ్లి రుద్రకు దిష్టి తీయమని శకుంతల అంటుంది. పెద్దసారు చాలా సంతోషంగా డాన్స్ చేస్తూ ఉంటాడు. గంగ వెళ్లి ఏమైందని అడగ్గా.. నువ్వు కూడా డాన్స్ చెయ్ అని పెద్దసారు అంటాడు. దీంతో ఇద్దరూ కలిసి సరదాగా డాన్స్ చేస్తారు. తరువాయి భాగంలో ప్రీతి బాబును ఎత్తుకున్నందుకు రంగాని శకుంతల తిడుతుంది. రంగాని తిడితే నన్ను తిట్టినట్లే అని రంగాకి సపోర్ట్ గా రుద్ర మాట్లాడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

[Jayam, Jayam Episode 385, Zee Telugu Serial, Rudra, Ganga, Veeru, Balakrishna, Shakuntala, Preethi, Ranga, Police Drama]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com