Home

»

Tv News

Jayam serial : రౌడీలను రఫ్ఫాడించిన రుద్ర.. గంగ ప్రేమగా ఏం చేసిందంటే?

Jul 18, 2026 11:00AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -323 లో..... రుద్ర, గంగ ఇంటికి వచ్చి రౌడీల గురించి చెప్తారు. నాకు డబ్బు ఇస్తాను పోటీ నుంచి తప్పుకోమని చెప్పారని చెప్తుంది. అలా చెప్పారంటే వాళ్ళు ఏం చెయ్యడానికైనా వెనుకాడరు అని శకుంతల అంటుంది. ఆ తర్వాత పెద్దసారుతో ఆ విషయం గురించి రుద్ర మాట్లాడతాడు. ఆ తర్వాత గంగపై ఎటాక్ చేయించింది విశ్వ ట్రైనింగ్ ఇచ్చిన ధీరజ్.


రౌడీలపై ధీరజ్ కోప్పడతాడు. మేం చాలా ట్రై చేసాం కానీ ఆ గంగ కన్విన్స్ కాలేదు.. పోటీ వద్దని చెప్పాము.. అప్పుడే తన భర్త వచ్చి మమ్మల్ని బాక్సింగ్ ఆడాడని రౌడీలు చెప్తారు. గంగ, రుద్ర విశ్వనాథ్ ఈ ముగ్గురు చాల మొండోళ్లు అని ధీరజ్ అంటాడు. ఇప్పుడు మనకి వాళ్ళ గురించి అన్ని తెలిసినా అతను మనకి సపోర్ట్ కావాలని ధీరజ్ అనుకొని వీరుతో మాట్లాడిన సంఘటన గుర్తుచేసుకుంటాడు.ఆ తర్వాత రుద్ర తన చేతి గాయంతో బాధపడుతుంటే ఏంటి సర్ ఏం చేస్తున్నారని రుద్రని అడుగుతుంది హా సెకండ్ షో సినిమాకి వెళదామని అనుకుంటున్నా వస్తావా అని రుద్ర వెటకారంగా అనగానే వస్తాను సర్ అని గంగ అంటుంది.

ఆ తర్వాత గాయంతో బాధపడుతుంటే వేడి నీళ్లు తీసుకొని వచ్చి రుద్ర షర్ట్ విప్పుతుంది గంగ. దాంతో ఏం చేస్తున్నావని రుద్ర అంటాడు. మీరు ఆగండి సర్ అని వేడి నీళ్ల కాపడం పెడుతుంది. అది రంగా చూసి డ్రీమ్ లోకి వెళ్తాడు. వాళ్ళు ఇద్దరు ప్రేమగా ఉన్నట్లు ఊహించుకుంటాడు. అప్పుడే రుద్ర వచ్చి ఏంటి మళ్ళీ డ్రీమా అని అంటాడు. అవునని రంగా అంటాడు. రొమాన్స్ చేస్తున్నారని చెప్తే కొడుతాడని అనుకొని ఏం లేదు బావ గంగ గెలిచినట్లు ఊహించుకున్నానని రంగా అంటాడు.‌ అది త్వరలోనే నిజం చేస్తానులే అని రుద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com