
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -305 లో.. పెద్దసారు దగ్గరికి లాయర్ వస్తాడు. మీకు నోటీసులు వచ్చాయని అతను అనగానే శకుంతల, పెద్దసారు, గంగ, రుద్ర, అంతా షాక్ అవుతారు. ఎందుకు ఏం అయిందని పెద్దసారు అంటాడు. సూర్య, ఇషిక అగ్రిమెంట్ చేసిన కంపెనీ ఫేక్ కంపెనీ. అది మీ కంపెనీ పేరు మీద డబ్బులు తీసుకొని, మీ పేరుని వాడుకొని కొన్ని కోట్ల డబ్బుని జనం నుండి దోచుకుంది.. దానికి మీ సూర్య, ఇషిక పెట్టిన సంతకాలే ఆధారాలు.. ఆ డబ్బులు పెట్టిన వాళ్ళు మీకు నోటీసులు పంపారు. అది క్లియర్ చేయాలంటే మీ ఆస్తులన్నీ తాకట్టు పెట్టినా సరిపోదని లాయర్ అంటాడు.
ఇషిక, సూర్యలని శకుంతల పిలుస్తుంది. ఏంటి లాయర్ గారు చెప్పేది నిజమేనా అని పెద్దసారు ఇంకా అతని తమ్ముడు అడుగుతారు.నిజమేనని సూర్య , ఇషిక అంటారు. మీ వల్ల ఇప్పుడు డబ్బే కాదు కుటుంబ పరువు కూడా పోయిందని పెద్దసారు అంటాడు. మరీ మరీ చెప్పాను ఎవరు వినలేదని పెద్దసారు అనగానే మా కాళ్ళ మీద మేము నిల్చోవాలని అనుకున్నాం.. డాక్యుమెంట్లు అన్నీ పక్కాగానే ఉన్నాయి.. అవన్నీ చూసే సంతకాలు చేశాం..కానీ వాడు అవన్నీ మార్చేసి మమ్మల్ని మోసం చేశాడని ఇషిక అంటుంది. రుద్ర చెప్పినా వినకుండా ఇలా చేశారని ఇషిక వాళ్ళ అత్తయ్య, మామయ్య అంటారు.
వాళ్ళు ఇలా మోసం చేస్తారని మాకు మాత్రం తెలుసా అని ఇషిక ఎమోషనల్ అవుతుంది. ఇక అది చూసిన రుద్ర అడ్వాంటేజ్ తీసుకొని.. వాళ్ళది కూడా పూర్తిగా ఏం తప్పు లేదు మామయ్య.. మనమే ఏదో ఒకటి చేసి దీనిని సాల్వ్ చేయాలి.. లేదంటే ఇన్నిరోజులు విజయేంద్ర ప్రతాప్ గొప్ప మనిషి అన్నవారే.. మోసం చేశాడని అంటారంటూ భయాన్ని పుట్టిస్తాడు వీరు. అది విన్న రుద్ర కోపంగా చూస్తాడు. దీనికి సొల్యూషన్ లేదా మరి అని లాయర్ ని వీరు అడుగుతాడు. మన చేతుల్లో ఏమీ లేదని లాయర్ చెప్తాడు. ఇక నేనే ఏదో ఒకటి చేస్తానని వీరు అనగా ఎవరేం చేయాల్సిన పని లేదని చెప్పి రుద్రని దగ్గరగా పిలుస్తాడు పెద్దసారు. అగ్రిమెంట్ చేసేముందు సూర్యకి నేను చెప్పాను.. ఇది మన విలువలతో కూడిన వ్యాపారం, చూసుకొని మొదలుపెట్టండి అని కానీ అవతలి వాడు మోసం చేశాడు.. ఇప్పుడు నువ్వు దీనిని సాల్వ్ చేయాలని రుద్రతో విజయేంద్ర ప్రతాప్ అంటాడు. మరి విజయేంద్ర ప్రతాప్ కి ఇచ్చిన మాటని రుద్ర నెలబెట్టుకుంటాడా లేదా.. వీరు వేసిన ప్లాన్ లో విజయేంద్ర ప్రతాప్ ఫ్యామిలీ రోడ్డు మీదకి రానుందా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






