Home

»

Tv News

Jayam serial : చావుబతుకుల్లో జయ.. వీరు, ఇషికల గుట్టు రట్టవుతుందా?

Jun 19, 2026 11:09AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-298 లో..  అనాధ ఆశ్రమానికి సీతారాం , విశ్వ వెళ్తారు. రుద్ర, రంగా విశ్వ ఇంటికి వెళ్తారు. అత్తయ్య నువ్వు ముందు జయని పిలువు.. ఒక విషయం చెప్పాలని‌ రుద్ర అంటాడు. నేను పిలుస్తానని లక్ష్మీ వెళ్తుంది. అప్పుడే గంగ కూడా అక్కడికి వస్తుంది. ఇంటి ముందు ఇషిక, వీరు కార్ లో ఉంటారు. 

జయ గదికి వెళ్ళిన లక్ష్మీ షాక్ అవుతుంది. జయ విషం తాగి పడి ఉంటుంది. వెంటనే సుధా అమ్మగారు రండి అంటూ పిలుస్తుంది లక్ష్మీ ‌. ఇక రుద్ర, గంగ, రంగా, సుధా అందరు వస్తారు. జయని ఆ పరిస్థితులలో చూసి అందరు షాక్ అవుతారు. సుధా ఏడుస్తుంటుంది. అత్తయ్య ‌. మీరు తప్పుకోండి తను విషం తాగింది అని రుద్ర తనని ఎత్తుకొని తీసుకెళ్ళి కార్ లో కూర్చోబెడతాడు. తర్వాత సుధా, గంగ, రంగా , రుద్ర అందరు కలిసి జయని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. వాళ్ళంతా హాస్పిటల్ కి వెళ్ళడం చూస్తాడు వీరు. జయ బ్రతికితే సింపథీ వర్కవుట్ అయి తన మీద ఇంకెప్పుడు డౌట్ పడరు.. ఒకవేళ తను చనిపోతే మన మీద ఎవరికి డౌట్ రాదు.. మనం సేఫ్ అని ఇషికతో వీరు అంటాడు. దాంతో ఇషిక టెన్షన్ పడుతుంది. 

హాస్పిటల్ లో జయకి ట్రీట్మెంట్ జరుగుతుంటుంది. మరోవైపు జయ గురించి వివరాలు తెలుసుకోవడానికి తనని చిన్నప్పుడు చేర్పచిన అనాధాశ్రమానికి వెళ్తాడు విశ్వ. అక్కడ వివరాలు చూస్తుంటారు. అప్పుడే పైడిరాజుకి ఫోన్ వస్తుంది. వెంటనే విశ్వ దగ్గరికి పైడిరాజు వచ్చి‌‌.‌. జయ విషం తాగిందంట అని చెప్తాడు. దాంతో విశ్వ షాక్ అవుతాడు. వెంటనే అక్కడి నుండి విశ్వ, పైడిరాజు బయల్దేరతారు. హాస్పిటల్ లో జయకి ట్రీట్మెంట్ అవుతున్న రూమ్ బయట సుధా కూర్చొని ఉంటుంది. అప్పుడే అక్కడికి విశ్వ వస్తాడు. విశ్వని చూసిన సుధా తన మీద కోప్పడుతుంది. ఇరవై సంవత్సరాలు అనాధాశ్రమంలో పెరిగిన అమ్మాయి ఎలా ఉంటుంది.. తనని సంప్రదాయంగా  లేదని, మన అమ్మాయి కాదని అనుమానించేసరికి తను విషం తాగిందని విశ్వపై సుధా  సీరియస్ అవుతుంది. అది కాదు సుధా.. ఇరవై సంవత్సరాల తర్వాత ఎవరో ఒకరు మన కూతురు అంటే ఎలా నమ్ముతాం.. వివరాలు తెలుసుకోవాలి కదా అని విశ్వ అంటాడు. అవసరం లేదు.‌ జయ నా కూతురు.. నా కూతురే.. ఇది నిజం.. ఇదే నిజం అని సుధా అంటుంది. అది కాదంటూ విశ్వ ఏదో చెప్పబోతుంటే.. మీరేం చెప్పకండి ఎందుకంటే జయ నా కూతురు.. నా కూతురు మళ్ళీ నాకు దూరం అవుతే నేను తట్టుకోలేను అనుకుంటూ కోపంలో బీపి తెచ్చుకొని పడిపోతుంది. వెంటనే తనని గంగ, రుద్ర పట్టుకుంటారు. వెంటనే రంగా వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని వస్తాడు. సుధా మీద వాటర్ చల్లాక తను లేస్తుంది. జయ బ్రతుకుతుందా.. అసలు వీరు ప్లాన్ ఏంటి.. జయ తన కూతురు కాదనే నిజం విశ్వకి తెలుస్తుందా లేదా..  రుద్ర అసలు నిజం చెప్తాడా లేదా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com