Home

»

Tv News

Jayam serial : ప్రీతి శ్రీమంతంలో రుద్ర ఎమోషనల్ స్పీచ్.. విశ్వ, సుధాకు శకుంతల గ్రాండ్ వెల్‌కమ్!

Jun 16, 2026 10:34AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -295 లో.....విశ్వ, సుధా‌ ఇద్దరు శ్రీమంతానికి వస్తారు. వాళ్ళని ఆహ్వానించకుండా శకుంతల గదిలోకి వెళ్తుంది. దాంతో శకుంతల దగ్గరికి రుద్ర వెళ్తాడు. పెద్దమ్మ మీరు చిన్నప్పటి నుంచి విలువలు నేర్పారు.. మీరు పెంచిన పద్దతి వల్లనే నేను ఇలా ఉన్నాను.. ఇప్పుడు మన ఇంటికి వచ్చింది ఈ ఇంటి ఆడపడుచు. తను సంతోషంగా ఉండాలి.. తను బాధపడుతూ ప్రీతీని ఆశీర్వదిస్తే బాగుండదు.. అందుకే మీరు ఈ ఒక్కరోజు ఎవ్వరిని బాధపెట్టకుంటే బాగుంటుందని శకుంతలకి రుద్ర నచ్చజెప్తాడు.

ఆ మాటలకి శకుంతల కాంప్రమైజ్ అవుతుంది. పదా అని రుద్రతో అంటుంది. ఇక  శకుంతల బయటకు వస్తుంది. గుమ్మం దగ్గరికి వస్తుంది శకుంతల.ఏంటి ఇంకా ఇలాగే ఉన్నారా.. లోపలికి రండి సుధా, విశ్వ అని శకుంతల అనగానే వీరు, ఇషిక షాక్ అవుతారు. గంగ హారతి తీసుకొని వచ్చి శకుంతలకి ఇస్తుంది. శకుంతల వాళ్లకు హారతి ఇచ్చి ఆహ్వానిస్తుంది. సుధా, విశ్వ లోపలికి వస్తారు. ప్రీతీ రెడీ అవుతుంటే.. తన దగ్గరికి సుధా వెళ్తుంది. ఒక ఆడపడుచుగా ఇంకొక ఆడపడుచు రావాలని కోరుకున్నావని చెప్తూ ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత గంగ, ఇందుమతి వాళ్ళతో సుధా వాళ్ళు సరదాగా మాట్లాడతారు. ఆ తర్వాత ప్రీతీ  శ్రీమంతం కుర్చీలో కూర్చుంటుంది. అందరు ఆశీర్వదిస్తారు.అదంతా గంగ చూసి ఆ ప్లేస్ లో తనే ఉన్నట్లు ఉహించుకుంటుంది.

ఆ తర్వాత గంగ ఉహాల్లో తెలిపోతుందని రుద్రకి అర్థం అయి గంగ అని పిలుస్తాడు. ఆ తర్వాత వీరు, ఇషిక నిషా పక్కకి వెళ్తారు. ముగ్గురు మాట్లాడుకుంటారు. ఏ నిషా ఎంజాయ్ చేస్తున్నావా అని వీరు అనగానే పార్టీ లేదు పబ్బులు లేవు.. షాపింగ్ లు లేవు..అంతా బోరింగ్ గా ఉందని నిషా అంటుంది.  పాపం మా అమ్మ చూసే ఆఖరి వేడుక ఇదే అని నిషా అనగానే అలా అంటున్నావేంటని వీరు అడుగుతాడు. మా నాన్న ఇక్కడికి రావాలంటే ఇక అమ్మ ఈ సిటీ వదిలి మీకు దూరంగా ఉండాలని చెప్పాడు.. దానికి అమ్మ ఒప్పుకుంది.. అందుకే నాన్న వచ్చాడని నిషా చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com