.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -291 లో.....అత్తని పిలిస్తేనే శ్రీమంతం చేసుకుంటానని ప్రీతీ కండిషన్ పెడుతుంది. ఆ తర్వాత శకుంతల దగ్గరికి వీరు వస్తాడు. మీరందరికి నేనంటే లెక్క లేదు.. నాకు తెలియకుండా ఆ సుధా దగ్గరికి వెళ్తున్నారు వస్తున్నారని శకుంతల కోప్పడుతుంది. అత్తయ్య మిమ్మల్ని బాధపెట్టాలని నా ఉద్దేశం కాదు.. ఇప్పుడు సుధా పిన్ని వస్తేనే ప్రీతీ శ్రీమంతం చేసుకుంటుంది. ఇప్పుడు మీరు ఆ సుధా పిన్నిని పిలవండి.. తను వచ్చాక మనం రివెంజ్ తీర్చుకోవచ్చని వీరు అంటాడు. దానికి శకుంతల సరే అంటుంది.
మరొకవైపు నిషా గుడ్ మార్నింగ్ డాడ్ అని విశ్వతో అంటుంది. నువ్వు చిన్నప్పుడు అమ్మానాన్న అని పిలిచేదానివి కదా ఇప్పుడు ఇలా అంటున్నావని విశ్వ అడుగుతాడు. దాంతో నిషా కవర్ చేస్తుంది. మనం భోజనానికి బయటకు వెళదాం.. అక్కడ మీతో కాసేపు టైమ్ స్పెండ్ చేసినట్లు ఉంటుందని చెప్పి లోపలికి వెళ్తుంది నిషా. టైమ్ స్పెండ్ చెయ్యాలని అంటుంది.. ఇప్పుడేమో గది లోపలికి వెళ్తుంది. నాకేం అర్థం కావడం లేదని సుధా తో విశ్వ అంటాడు. తనకి అలవాటు కావడానికి టైమ్ పడుతుందని సుధా అనగానే విశ్వ సైలెంట్ గా ఉంటాడు. మరొకవైపు అత్తయ్య సుధా పిన్నిని పిలవడానికి ఒప్పుకుందని వీరు చెప్తాడు. దాంతో అందరు షాక్ అవుతారు. పెద్దమ్మ ఒప్పుకోవడం ఏంటి నాకు ఆశ్చర్యంగా ఉంది.. ఇందులో ఏదో ఉందని రుద్ర అనుకుంటాడు.
వీరు మాటలు నమ్మడానికి లేదు.. ఏదో ప్లాన్ చేసి ఉంటాడని రుద్ర అంటాడు. ఇషికని నువ్వు ఓ కంట కనిపెడుతూ ఉండమని గంగకి చెప్తాడు రుద్ర. అలాగే నువ్వు వీరుని కనిపెట్టుకొని ఉండమని రంగాకు రుద్ర చెప్తాడు. ఆ తర్వాత సుధా పిన్నిని శ్రీమంతానికి పిలవడానికి వెళ్తున్నాం.. నువ్వు కూడా రావాలి బావ అని రుద్రతో వీరు అంటాడు. నేను రానని రుద్ర అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





.webp)
