.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -287 లో..... గంగ పోటీలో గెలుస్తుంది అక్కడ తను ఎలా బాక్సింగ్ ఆడుతుందో చూడడానికి అందరు ఒకరికి తెలియకుండా ఒకరు వస్తారు. ఇక పోటీ ముగిసాకా విశ్వ కార్ దగ్గరికి వస్తాడు. ఆల్రెడీ సుధా, లక్ష్మిని అక్కడ విశ్వ చూస్తాడు. వాళ్ళని కూడా కార్ లో రమ్మనని పైడిరాజుకి విశ్వ చెప్తాడు. వాళ్ళు వచ్చి కార్‌లో కూర్చుంటారు. ఆ తర్వాత నేను గంగని బాక్సింగ్ లో సెలెక్ట్ చేస్తానో లేదో అన్న డౌట్ తో వచ్చావ్ కదా అని సుధాని విశ్వ అడుగుతాడు.
కాదండి గంగ ఎలా బాక్సింగ్ చేస్తుందో చూడడానికి వచ్చానని సుధా చెప్తుంది. గంగ సెలెక్ట్ అయింది. తనకి మంచి ట్రైనింగ్ ఇవ్వమని రుద్రకి చెప్పానని విశ్వ అంటాడు. అదేదో మీరే ఇవ్వొచ్చు కదా అని సుధా అంటుంది. దాంతో విశ్వ ఏం మాట్లాడడు. మరొకవైపు ఇంట్లో అందరు గంగ బాక్సింగ్ లో సెలెక్ట్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు. పెద్దసారు ఇంటికి వచ్చి శకుంతల కూడ గంగ గెలుపు చూడడానికి అకాడమికి వచ్చిందని చెప్తాడు. అక్క తన ఫ్రెండ్ ని కలిసి వస్తానని అబద్ధం చెప్పిందన్నమాట అని ఇందుమతి అంటుంది. అమ్మగారు నా కోసం అకాడమికి వచ్చారా అని గంగ ఎక్సైట్ అవుతుంది. పెద్దమ్మ వచ్చిందా అని రుద్ర హ్యాపీగా ఫీల్ అవుతాడు.
ఆ తర్వాత శకుంతల వచ్చి ఏం తెలియనట్లు గంగకి కంగ్రాట్స్ చెప్తుంది. అక్క మీ ఫ్రెండ్ ని కలుస్తానన్నావ్ కదా తను బాగుందా అని ఇందుమతి అడుగగా.. శకుంతల తడబడుతుంది. నీకు సుధా కనిపించింది కదా మాట్లాడావా అని పెద్దసారు అడుగుతాడు. మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళతో ఏం మాట్లాడుతానని శకుంతల కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)

