.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -275 లో.. విశ్వ దగ్గరికి గంగ వస్తుంది. తన మాటలతో నవ్విస్తుంది. అది చూసి గంగ షాక్ అవుతుంది. మీరు నవ్వితే బాగుంటారు సర్.. ఇలా ఎప్పుడూ నవ్వుతూ ఉండొచ్చు కదా.. ఎందుకని సీరియస్ గా ఉంటారని గంగ అంటుంది. అప్పుడే అక్కడికి సుధా వస్తుంది. ఆయనికి కేరింగ్ చాలా ఉంటుంది కానీ మనసులో దాచేసి సీరియస్ ని మాత్రం బయటకు చూపిస్తాడని సుధా అంటుంది. ఇక విశ్వకి జ్యూస్ ఇచ్చేసి గంగకి కిందకి తీసుకొని వస్తుంది సుధా. మర్యాదలు అవీ చేసి గంగని పంపిస్తుంది సుధా.
మరుసటిరోజు రుద్ర నాలుగు బైక్ నెంబర్లు పేపర్లో రాసిపెట్టి తీవ్రంగా ఆలోచిస్తుంటాడు. అప్పుడే అక్కడికి రంగా, గంగ వస్తారు. ఏంటి సర్ వాటి గురించి అంతలా ఆలోచిస్తున్నారని గంగ అడుగగా ఇవి విశ్వ సర్ ని ఎటాక్ చేసిన వాళ్ళవి అని చెప్తాడు. ఈ బైక్స్ ఎవరివి, అడ్రెస్ ఏంటి, మొబైల్ నెంబర్స్ అన్ని డీటేయిల్స్ కావాలని రంగాతో రుద్ర చెప్పగానే అతను సరే అంటాడు. మరోవైపు ప్రమీల కోసం కార్తీక్, మక్కం ఎదురుచూస్తుంటారు. ప్రమీల మేడమ్ ఆవకాయ పచ్చడి తీసుకొస్తుందని నేను వొట్టి అన్నమే తెచ్చుకున్నాను..కర్రీ తెచ్చుకోలేదని మక్కంతో కార్తీక్ చెప్తాడు. మేడమ్ తీసుకురారు అని మక్కం అంటాడు. కాసేపటికి ప్రమీల హ్యాండ్ బ్యాగ్ తో నడుచుకుంటూ వస్తుంది. ఇక మక్కం ఫుల్ హ్యాపీగా ఉంటాడు. ఎందుకు అంత హ్యాపీగా ఉన్నావని మక్కంని అడుగగా కార్తీక్ కర్రీ తెచ్చుకోలేదని చెప్తాడు. ఇక కార్తీక్ డిస్సప్పాయింట్ అవుతాడు. ప్రమీల తన హ్యండ్ బ్యాగ్ లో నుండి ఆవకాయ జాడీ తీస్తుంది. కార్తీక్ కి ఇస్తుంది. అది చూసి మక్కం షాక్ అవుతాడు.
మరోవైపు విశ్వ వాళ్ళ ఇంటికి వీరు వస్తాడు. అతడిని చూసిన గంగ వాళ్ళ తల్లి లక్ష్మీ ఆమె భర్తకి చెప్తుంది. ఇద్దరు వీరు దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు. పిన్ని కోసం వచ్చానని అబద్ధం చెప్తాడు. ఇక ఇంట్లోకి వెళ్ళి సుధాతో మంచిగా మాట్లాడతాడు. నేను కూడా చెల్లిని వెతికి పెడతా తన చిన్నప్పటి ఫోటో ఉందా అని వీరు అనగానే సుధా తీసుకురావడానికి లోపలికి వెళ్తుంది. మరోవైపు విశ్వని కొట్టించింది అతని శిష్యుడు ధీరజ్ యొక్క ఫ్రెండ్స్ అని రంగా చెప్తాడు. దాంతో రుద్ర తన మీద రివేంజ్ తీసుకోవాలని అనుకుంటాడు. మనం విశ్వ సర్ కి చెప్దామా అని గంగ అనగానే వద్దు.. మనమే ఇలా చేసామని అనుకుంటాడని రుద్ర అంటాడు. ఆ తర్వాత అకాడమీకి వెళ్ళి ధీరజ్ ని కొడతాడు రుద్ర. అప్పుడే విశ్వ వస్తాడు. ఇక రుద్ర, గంగా అక్కడి నుండి వచ్చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
