.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-274 లో.. శకుంతల కొత్త ఆవకాయ పచ్చడి పెడుతుంది. ఇక దానిని ఎలాగైనా పాడుచేయాలని ఇషిక, వీరు ప్లాన్ చేస్తారు. అందులో ఉప్పు కలపడానికి ఇషిక వెళ్తుంది. అప్పుడే అక్కడికి గంగ వస్తుంది. ఇషికని రెడ్ హ్యాండెండ్ గా పట్టుకుంటుంది. దాంతో అందరు వచ్చేస్తారు. ఎందుకిలా చేశావని ఇషికపై శకుంతల కోప్పడుతుంది. ఇక ఇషిక ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తుంది. ఇక అందరికి జాడీలలో కడుతుంటారు. అప్పుడే నాకొక జాడీ కావాలని గంగ అనగానే ఎందుకని శకుంతల అంటుంది. శకుంతల అమ్మకి ఇవ్వాలని గంగ నోరు జారుతుంది. ఎవరు అని శకుంతల అడుగుతుంది. మా అమ్మనాన్న ఇద్దరు వాళ్ళింట్లోనే పని చేస్తుంటారు. చాలా మంచివాళ్ళు అని గంగ చెప్తుంది. అయితే వద్దు అని శకుంతల అంటుంది. ప్రతీ అడ్డమైన వాళ్ళకి ఈ ఆవకాయ పచ్చడి ఇవ్వకు.. కావాలంటే మీ అమ్మనాన్నలకి తీసుకెళ్ళమని శకుంతల చెప్తుంది. ఇక గంగని రంగా తీసుకొని పక్కకి వెళ్ళి.. నీకు నోరు ఆగదా చెల్లి అని అంటాడు. ఏదో అలా వచ్చేసిందని గంగ అంటుంది.
గంగ, రంగాల దగ్గరికి పెద్దసారు వస్తాడు. నేను నా చెల్లెలికి ఆవకాయ తీసుకెళ్తానని పెద్దసారు అంటాడు. లేదు నేను మా అమ్మకి తీసుకెళ్తానని గంగా అంటుంది. లేదు నేనే తీసుకెళ్తానని పెద్దసారు అనగానే సరే మీ చెల్లెలికి మీరే తీసుకెళ్ళండి.. నేను వెళ్ళి మా అమ్మ చేత గోరుముద్దలు తింటానని గంగా సంబరపడుతుంది. మరోవైపు ప్రమీల కోసం కార్తీక్ సూపర్ మార్కెట్ లో ఎదురుచూస్తుంటాడు. ఇక తను కూర్చునే సీట్ దగ్గరికి వెళ్ళి అందులో కూర్చొని మురిసిపోతాడు. అప్పుడే అక్కడికి మక్కం వస్తాడు. ఏంటండి మేడమ్ ఇంకా రాలేదని కార్తీక్ అడుగగా మీరు చాలా మితిమీరిపోతున్నారు. నాకు బీపీ పెరిగిపోతుందని మక్కం అంటాడు. నేనేదో అభిమానం కొద్దీ అడిగానని కార్తీక్ అనగానే మీరు అభిమానం దాటి ఇష్టాన్ని కాదని ప్రేమలోకి ఎప్పుడో వెళ్ళిపోయారని మక్కం అంటాడు. అవునా ఇది ప్రేమేనా అని కార్తీక్ మురిసిపోతాడు. మరోవైపు ఇంకా రుద్ర ఇంటికి రాలేదేంటని గంగా, రంగాలను పెద్దసారు అడుగుతాడు. అప్పుడే రుద్ర వస్తాడు. అది గమనించిన వీరు చాటు నుండి వింటాడు.
ఏం అయింది రుద్ర ఎక్కడికి వెళ్ళావని పెద్దసారు అడుగుతాడు. విశ్వ మామయ్యని ఎవరో తీవ్రంగా కొట్టారు.. గాయాలయ్యాయి.. హాస్పిటల్ లో జాయిన్ చేసి ట్రీట్ మెంట్ చేపించి నేను ఇప్పుడే వాళ్ళట్లో డ్రాప్ చేసి వస్తున్నానని రుద్ర చెప్తాడు. ఆ మాటలన్నీ చాటునుండి వీరు వింటాడు. నేను చూడటానికి వెళ్తానని గంగ బయల్దేరి వెళ్తుంటే వద్దని రుద్ర అంటాడు. ..అతనిపై ఎటాక్ చేసింది మనమే అని అనుకుంటున్నాడా అని పెద్దసారు అంటాడు. అవేమీ నాకు తెలియదు నేను వెళ్తానని గంగ ఫ్రూట్స్ తీసుకొని వెళ్తుంది. ఇక ఈ మాటలన్నీ విన్న వీరు ఎలాగైన ఇషికని కన్విన్స్ చేసి తన ప్లాన్ చెప్పాలని వెళ్తుంది. కానీ వీరుపై ఇషిక సీరియస్ గా ఉంటుంది. ఇక ఇషికని ఎలాగోలా కన్విన్స్ చేసి తన ప్లాన్ చెప్తాడు వీరు. మరోవైపు విశ్వ ఇంటికి గంగ వెళ్తుంది. వద్దమ్మా సుధా నువ్వు ఇంటికి వెళ్ళు.. నీ మీద కోప్పడతాడని సుధా అంటుంది. అంటే పడతానని గంగ వెళ్తుంది. ఎలా ఉందండి అని విశ్వని గంగ అడుగుతుంది. నేను నిన్ను తిడతానని తెలుసి కూడా వచ్చావా అని విశ్వ అంటాడు. ఏంటో అండి మీరు తిట్టినా నాకు మా నాన్న తిట్టినట్టే అనిపిస్తుంది అందుకే మిమ్మల్ని చూడటానికి వచ్చేసానని గంగ చెప్తుంది. దాంతో విశ్వ ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
