Home

»

Tv News

Jayam serial : సూర్య కొత్త ప్రాజెక్ట్ వెనుక వీరు కుట్ర..జయం సీరియల్‌లో ఊహించని ట్విస్ట్!

May 19, 2026

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -272 లో.....ప్రాజెక్ట్ ఒకే అయినందుకు సూర్య స్వీట్ తీసుకొని వస్తాడు. ఆ ప్రాజెక్ట్ వల్ల ప్రాబ్లమ్ వస్తుందని రుద్ర చెప్తాడు. అవన్నీ మీరు చెప్పొద్దూ.. మాకు వదిలెయ్యండి అని సూర్య కోపంగా మాట్లాడతాడు. మొదటి రోజే సక్సెస్ సాధించానని ఇషిక అంటుంది. అందరికి స్వీట్స్ ఇస్తాడు సూర్య. అన్నయ్యకి ఇవ్వలేదని ప్రీతీ అడుగుతుంది. అంటే ఇది అన్నయ్యకి స్వీట్ న్యూస్ కాదని సూర్య అంటాడు.

మొదటి రోజే సక్సెస్ సాధించావ్ ఇషిక గ్రేట్ అని వీరు అనగానే థాంక్స్ అని చెప్పి ఇషిక వెళ్ళిపోతుంది. అయ్యో పిచ్చి ఇషిక.. ఆ ప్రాజెక్ట్ వచ్చేలా చేసిందే నేను.. అది ప్రాఫిట్ వచ్చే ప్రాజెక్ట్ కాదు.. ముంచే కాలేజీ ప్రాజెక్ట్ అని వీరు అనుకుంటాడు. మరుసటిరోజు రంగా మామిడికాయలు తీసుకొని వచ్చి ఇంట్లో అందరిని పిలుస్తాడు. అందరు వస్తారు. రుద్ర మాత్రం స్పెషల్ గా రెడీ అయి వస్తాడు. నా భర్తకి నా దిష్టే తగిలేలా ఉందని గంగ అనుకుంటుంది. పెద్దమ్మకి ఇప్పుడు ఆవకాయ పెట్టడంలో హెల్ప్ చేస్తాను కదా.. ఎప్పుడు హెల్ప్ చేసినా ఇలాగే రెడీ అవుతానని రుద్ర అంటాడు.

అప్పుడే ఇషిక, సూర్య ఆఫీస్ కి రెడీ అవుతారు. ఇషిక నువ్వు ఇంట్లోనే ఉండు ఆవకాయ పెట్టాలని ఇందుమతి అనగానే ఆ పనులన్నీ ఇంట్లో ఖాళీగా ఉన్నవాళ్ళు చేస్తారని ఇషిక అంటుంది. ఏంటి ఆఫీస్ కి వెళ్ళగానే పొగరు తలకి ఎక్కిందా అని ఇషికపై శకుంతల కోప్పడుతుంది. ఎప్పుడు ఆవకాయ పెట్టినా ఇంట్లో అందరం సరదాగా ఉంటాం.. అందుకే తను ఉండమంది అని శకుంతల కోప్పడుతుంది. దాంతో ఇషిక ఇంట్లోనే ఉంటుంది. ఆ తర్వాత రుద్ర, గంగ మామిడికాయ వక్కలు కట్ చేస్తుంటారు. మరొకవైపు విశ్వ ఇంటికి సీతారాములు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com