జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -318 లో...... టోర్నమెంట్ అయ్యాక సుధా వెళ్ళిపోతుందని పెద్దసారు టెన్షన్ పడుతుంటే గంగ వచ్చి ఏదో ఒకటి చేసి వాళ్లని ఆపడానికి ప్లాన్ చెయ్యాలని చెప్తుంది. అప్పుడే రుద్ర వచ్చి నువ్వు మాటలు ఆపి ప్రాక్టీస్ కి వెళ్ళమని రుద్ర చెప్తాడు. ఆ తర్వాత సుధామ్మా వెళ్తుందని పెద్దసారు బాధపడుతున్నారని రుద్రతో గంగ అనగానే మీరేం కంగారుపడకండి పెద్దనాన్న వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండేలా ప్లాన్ చేస్తానని రుద్ర అంటాడు.
మరొకవైపు గంగ అలారం మొగుతున్నా కూడా పట్టించుకోకుండా పడుకుంటుంది. అప్పుడే రుద్ర వచ్చి తనని నిద్ర లేపుతాడు.. సర్ ఇప్పుడు టైం మూడు అవుతుంది.. ఇప్పుడు లేవడం ఏంటని గంగ అంటుంది. ముందు మీరు మా అన్నని నిద్ర లేపండి అని గంగ అనగానే చెల్లి నేను ఎప్పుడో రెడీ అని రంగా అంటాడు. మరొకవైపు పైడిరాజు లక్ష్మీ ఇద్దరు విశ్వకి నిజం చెప్పాలని అనుకుంటారు. అప్పుడే విశ్వ వచ్చి మీరు చాలా సంతోషంగా ఉన్నట్లున్నారు.. మీ కూతురు గంగ బాక్సింగ్ లో గెలుస్తుందని విశ్వ అనగానే గంగ మా కూతురు కాదు బాబు మీ కూతురు.. మీరు చిన్నప్పడు ఒకతనికి ఇచ్చారు.. అప్పుడు మేం తెచ్చుకొని పెంచుకున్నామని పైడిరాజు అనగానే అదంతా జయ విని గంగ అసలైన కూతురా ఇప్పుడు ఏం చెయ్యాలని జయ అనుకుంటుంది.
పైడిరాజు చెప్పింది విశ్వ, సుధా విని షాక్ అవుతారు. జయ వచ్చి మీకు మా ఆస్తులపై కన్నుపడిందని అంటుంది. విశ్వ కలిపించుకొని అంతా అబద్ధం.. నీ కూతురు నా కూతురు అని చెప్తే ఎక్కువ ఇంట్రెస్ట్ తో నేర్పిస్తానని ప్లాన్ చేసావని పైడిరాజు కోప్పడతాడు. తరువాయి భాగంలో కార్తీక్ గురించి ప్రమీల ఎక్కువ కేర్ తీసుకుంటుందని తెలిసి ఇంట్లో గొడవ జరుగుతుంది. దాంతో కార్తీక్ గారి కళ్ళు మన భాను గారి కళ్ళు అని అసలు విషయం శకుంతలకి ప్రమీల చెప్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




