Home

»

Tv News

Jayam Serial : గంగ కాళ్ళు‌ పట్టుకొని క్షమాపణ చెప్పిన జయ.. వీరుకి షాకిచ్చిన విశ్వ!

Oct 18, 2026 10:36AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ 402లో..‌ పెద్ద సారు రుద్రకి ఫోన్ చేసి ఇంకా రాలేదు ఏంటని అడుగుతాడు. గంగ గురించి నిజం చెప్పకుండా రుద్ర మావయ్య దగ్గర ఉన్నాం..‌గంగ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడుతుందని అబద్ధం చెప్తాడు. గంగ ఇంట్లో లేకపోతే సందడి లేదని పెద్దసారు అంటుంటే‌ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న గంగని చూసి రుద్ర లోలోపల బాధపడతాడు. ఇంతలో ఫోన్ ఇందుమతి తీసుకొని గంగ వచ్చేటప్పుడు జిలేబి తీసుకొని వస్తానని చెప్పింది..‌తనకి గుర్తు చెయ్ అని చెప్పడంతో రుద్ర సరే అంటాడు.

ఆ తర్వాత డాక్టర్ వచ్చి గంగ స్పృహలోకి వచ్చిందని చెప్తాడు. రుద్ర, రంగా ఇద్దరూ వెంటనే గంగ దగ్గరకు వచ్చి మాట్లాడుతారు. అప్పుడే సుధా వచ్చి నీకు అందులో విషం ఉందని తెలిసినప్పుడు ఎందుకు తిన్నావని నిలదీస్తుంది. దానికి గంగ అక్కడ అది తినకుంటే నిందతో బయటకు వచ్చేదాన్ని అందుకే తిన్నానని షాకింగ్ సమాధానమిస్తుంది. జయ చేసింది తప్పు, దాని తరపున నేను క్షమాపణ అడుగుతున్నానని రుద్ర కాళ్ళు మొక్కబోతుంది సుధా. దంతో రుద్ర వద్దని వారిస్తాడు. కానీ గంగ కాళ్ళు పట్టుకొని జయ క్షమాపణ అడగాలని రుద్ర గట్టిగా చెప్తాడు. రుద్ర మాటలకు జయ అక్కడికి వస్తుంది.

సుధా చెప్పగానే గంగ కాళ్ళు పట్టుకొని సారీ చెప్తుంది జయ. ఆ తర్వాత జయ ఇంటికి వచ్చి వీరుకి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది. దంతో వీరు తనపై కోప్పడతాడు. అప్పుడే విశ్వ వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావని అడుగుతాడు. వెంటనే జయ తెలివిగా వీరు బ్రో కాల్ చేశాడు.. ప్రాక్టీస్ గురించి అడుగుతున్నాడు..‌మీరు మాట్లాడండి అని చెప్పి ఫోన్ ఇస్తుంది. ఏంటి వీరు నీకు రుద్ర గంగ అంటే పడదా.. ఇంట్లో ఉన్న గంగని వదిలేసి జయకి ఫోన్ చేసి అడుగుతున్నావని విశ్వ నిలదీస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

[Jayam Serial Today Episode October 17th, Jayam Serial Zee Telugu Episode 402, Ganga Poison Drama, Jaya Apologize To Ganga]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com