Home

»

Tv News

Jayam serial : బాలకృష్ణకి మెలుకవ.. గన్ తో పాయింట్ చేసిన వీరు, రుద్రకి షాక్!

Oct 23, 2026 7:10PM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-406లో.. గంగ కిచెన్ లో ఉండగా స్వీట్ అండ్ ఐస్ క్రీమ్ కనపడటంతో తను టెంప్ట్ అవుతుంది. ఐస్ క్రీమ్ తీసుకొని వెనక్కి తిరగానే అక్కడ రుద్ర ఉంటాడు. దాంతో గంగ వెంటనే కవర్ చేస్తుంది. ఐస్ క్రీమ్ అందులో పెట్టి కీరా ఎక్కడా కనపడం లేదంటూ గంగ కవర్ చేసి వెళ్ళిపోతుండగా రుద్ర తనని ఆపుతాడు. ఏం చేస్తున్నావని అడగగా నా అంతరాత్మ అలా చెప్పిందని గంగ అనగానే రుద్ర తనపై సీరియస్ అవుతాడు.

నీ మీద నువ్వు కంట్రోల్ లేకపోతే ఎలా.. మేము మోటివేట్ ఇచ్చింది గుర్తుండదు కానీ నీ అంతరాత్మ మోటివేట్ చేసిందని స్వీట్ తింటావా అంటూ రుద్ర కోప్పడతాడు. అదే సమయంలో కోమాలో బాలకృష్ణకి మెలుకవ వస్తుంది. డాక్టర్ చూసి రంగాకి కాల్ చేసి విషయం చెప్తాడు. ఆ విషయం వెంటనే రుద్రకి చెప్తాడు రంగా. ఇక రంగ, గంగ, రుద్ర మాట్లాడుకోవడం వీరు వింటాడు. గంగతో మాట్లాడేసి రుద్ర, రంగ బయల్దేరి వెళ్తారు. ఇదే అదునుగా భావించిన వీరు.. శకుంతల దగ్గరికి వెళ్ళి విషయం చెప్తాడు.దాంతో ఒక ప్లాన్ చెప్తాడు శకుంతల. పెద్దసారుతో మెల్లిగా మాట్లాడి బాలకృష్ణ ఉన్న ప్లేస్ తెలుసుకోవాలని శకుంతలతో వీరు అంటాడు. 

ఇక పెద్దసారు దగ్గరికి శకుంతల వెళ్ళి మెల్లిగా మాట్లాడుతుంది. రుద్ర ఒక్కడే కష్టపడుతున్నాడు కదా అండి మనం కూడా రుద్రకి సపోర్ట్ చేద్దాం.. ఆ బాలకృష్ణ ఎక్కడున్నాడో తెలిస్తే మనం కూడా సాయం చేస్తాం కదా అని శకుంతల అనగానే సరే మరి అడ్రెస్ ఎలా అని పెద్దసారు అనగానే గంగకి తెలిసే ఉంటుందని శకుంతల అంటుంది. కాసేపటికి గంగ కాఫీ తీసుకొని వచ్చి పెద్దసారుకి ఇస్తుంది. మమ్మల్ని ఆ బాలకృష్ణ దగ్గరికి తీసుకొని వెళ్తావా అని పెద్దసారు అనగానే గంగ షాక్ అవుతుంది. నా దగ్గర ఏం దాస్తున్నావని పెద్దసారు నిలదీయగా సరేనని తీసుకొని వెళ్తానని గంగ అంటుంది. ఇక ఆ తర్వాత వీరు క్యాబ్ డ్రైవర్ వేశం వేసుకొని వస్తాడు. ఇక ఆ క్యాబ్ లో గంగ, శకుంతల, పెద్దసారు వెళ్ళగా డ్రైవర్ గా వీరు ఉంటాడు.అందరు కలిసి బాలకృష్ణ ఉన్న ప్లేస్ కి  వెళ్తాడు. అక్కడ శకుంతల, పెద్దసారుని చూసి రుద్ర షాక్ అవుతాడు. మీరేంటి ఇక్కడ అని రుద్ర అడుగగా ఏ మేం రాకూడదా అని పెద్దసారు అంటాడు. అది కాదు పెద్దనాన్న ఇతని ప్రాణాలకి ప్రమాదం అని రుద్ర చెప్తాడు. అదేసమయంలో కిటికీలో నుండి వీరు గన్ తో బాలకృష్ణని పాయింట్ చేస్తాడు. కానీ అదే సమయంలో ఎవరో అడ్డుగా నిలబడటంతో అతను బాలకృష్ణని షూట్ చేయలేకపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com