Home

»

Tv News

Jayam Serial Today Episode 403: గంగ గురించి రుద్ర నిజం చెప్తాడా!

Oct 20, 2026 12:47PM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-403లో.. గంగని తీసుకొని రుద్ర ఇంటికి వస్తాడు. గంగ ఏంటి అలా ఉందని పెద్దసారు అడగగా కొంచెం డీహైడ్రేట్ అయిందని రుద్ర చెప్తాడు. అప్పుడే శకుంతల వచ్చి ఏమైంది, ఇంట్లో పనులు అన్నీ ఎవరు చేస్తారని అంటుంది. హేయ్ బేబీ నాకు జిలేబీ తీసుకొని వస్తానన్నావ్ అని గంగని ఇందుమతి అడుగుతుంది. మర్చిపోయాను అత్తయ్య అని గంగ నీరసంగా మాట్లాడుతుంది. ఇంట్లో వాళ్లకి జరిగిన విషయం చెప్పకుండా రుద్ర, గంగ జాగ్రత్త పడతారు.

గంగని తీసుకొని రుద్ర లోపలికి వెళ్తాడు. శకుంతల నువ్వు జ్యూస్ చేసి ఇవ్వమని పెద్దసారు చెప్తాడు. నీకేం కావాలన్నా నాకు చెప్పు అని గంగతో రుద్ర అంటాడు. రుద్ర చేయి గంగ పట్టుకొని.. సర్ ఒకవేళ నాకు ఏమైనా అయితే అందరు చాలా బాధపడేవారు. ముఖ్యంగా మిమ్మల్ని ఎవరు చూసుకునే వాళ్లు అని గంగ ఎమోషనల్ అవుతుంది. నువ్వు అదంతా ఎందుకు ఆలోచిస్తున్నావు, నీకు ఏం కాదు, నీ లక్ష్యం గురించి ఆలోచన ఉండాలి తప్ప ఇలాంటివి వద్దు, నీ లక్ష్యానికి నువ్వు భయపడు ఇలాంటి వాటికి కాదని రుద్ర చెప్తాడు.

ఆ తర్వాత అదంతా రంగా వింటాడు. బయటకు రుద్ర రాగానే ఏంటి బావా చెల్లి అంత బాధపడుతుంటే ఇప్పుడు కూడా పోటీ లక్ష్యం అంటూ మాట్లాడుతున్నావ్, నీకు తన మీద ప్రేమ లేకున్నా సరే అలా మాట్లాడితే ఎలా అని రంగా నిలదీస్తాడు. గంగని నేను పిరికిదానిలాగా రెడీ చేయాలని అనుకోవట్లేదని రుద్ర చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

[Jayam Serial Today Episode 403, Jayam Serial Zee Telugu, Ganga Dehydrated Emotional Rudra, Ganga Rudra Latest Episode]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com