.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-397లో.. ఆ కిడ్నాపర్స్ అడిగిన డబ్బుని ఇచ్చి నా బాబుని నేను కాపాడుకునేవాడిని కానీ రుద్ర బావ ఆపేశాడు.. నా బాబుని ఇప్పుడు రిస్క్ లో పెట్టాడు.. నా బాబు ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయాడనుకుంటా అని వీరు నటిస్తుంటాడు. అదంతా విన్న శకుంతల ఫుల్ కోపంగా .. రుద్ర.. రుద్ర.. రుద్ర.. ఏమైనా దేవుడా తీసుకురావడానికి అని కోపంగా అరుస్తుంది. ఫోన్ చేసాను అత్తయ్య కలవడం లేదని ఇషిక అంటుంది. దాంతో ప్రీతీ, శకుంతల ఏడుస్తారు. రౌడీలు పిల్లాడిని ఏం అయినా చేస్తారేమో అని ఇషిక అనగానే ప్రీతీ, శకుంతల ఇంకా టెన్షన్ పడతారు. అలాంటిదేం ఉండదు.. రుద్ర తీసుకొస్తానని చెప్పాడు కదా అని పెద్దసారు అంటాడు.
మరికాసేపటికి ఇక నా వల్ల కాదు మామయ్య.. నేనే వెళ్లి నా బాబుని తెచ్చుకుంటా అంటు పెద్దసారు కాళ్ళ మీద పడబోతుంటాడు వీరు. అప్పుడే జై జై గణేశా జై కొడతా గణేశా అంటూ పాట వేసుకొని డ్యాన్స్ చేస్తూ వస్తుంటారు గంగ, రంగ.. వాళ్ళిద్దరిని చూసి అందరు షాక్ అవుతారు. వాళ్ళ దగ్గరికి శకుంతల వెళ్తుంది. ఆపండి మీ గోల.. బాబుని తీసుకెళ్ళారని మేము ఏడుస్తుంటే మీరేమో ఇలా డ్యాన్స్ చేస్తున్నారేంటని శకుంతల కోప్పడుతుంది. మీరేం భయపడకండి.. ఆల్రెడీ రుద్ర బావ బాబుని తీసుకొస్తున్నాడు.. అక్కడ చూడండి అనగానే రుద్ర బాబుని తీసుకొస్తాడు. బాబుని చూసి ప్రీతీ ఎమోషనల్ అవుతూ వచ్చి ఎత్తుకొని ముద్దాడుతుంది.
వీరు మాత్రం అక్కడే ఉంటాడు. రుద్రకి నిజం తెలిసి తన పీక పట్టుకునన్నట్టు డ్రీమ్ లోకి వెళ్తాడు. వెంటనే మళ్ళీ మాములుగా అయి షాక్ అవుతాడు. అదేంటి వీరు.. ఇంతసేపు బాబు .. బాబు అని ఏడ్చావ్. ఇప్పుడు కనీసం దగ్గరికి వెళ్ళట్లేదని వంశీ వాళ్ళ నాన్న అనగానే షాక్ లో ఉన్నా అని కవర్ చేస్తాడు వీరు. ఆ తర్వాత బాబు దగ్గరికి వెళ్ళి ఎత్తుకొని ముద్దాడతాడు. అదేంటి బావ అంత కష్టపడి రౌడీల నుండి బాబుని సేఫ్ గా కాపాడిన రుద్ర బావకి ఒక్క థాంక్స్ కూడా చెప్పలేదని రంగా అడుగగా థాంక్స్ బావ అని వీరు అంటాడు. రౌడీలని పంపించింది వీరు అనే నిజాన్ని రుద్ర తెలుసుకుంటాడా లేదా తెలియాలంటే తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
