.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్- 391లో.. విశ్వ, జయ, రుద్ర, గంగ అందరు స్పాన్సర్ మీటింగ్ కి వస్తారు. అక్కడ జయకి ఢిల్లీ అమ్మాయితో పోటీ జరుగుతుందని, గంగకి ముంబై అమ్మాయితో పోటీ జరుగుతుందని స్పాన్సర్స్ చెప్తారు. అందులో గెలిచిన వాళ్లకి ఫైనల్ మ్యాచ్ ఉంటుందని అందులో గెలిచిన అమ్మాయికే స్పాన్సర్‌షిప్ ఉంటుందని వాళ్లు చెప్తారు. దీనికి రుద్ర ఒప్పుకుంటాడు,.. విశ్వ కూడా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత పోటీని కఠినం చేయాలని రుద్ర అంటాడు. విశ్వ కార్ ట్రబుల్ ఇస్తే రుద్ర తన కార్ లో రమ్మని చెప్తాడు. దీంతో విశ్వ, జయ వాళ్ల కార్ లో ఎక్కుతారు.
కార్ లో గంగ కావాలనే జయని టెన్షన్ పెట్టేలా మాట్లాడుతుంది. జయ పోటీలో గెలిస్తేనే విశ్వ గారి కూతురు అనుకుంటారని గంగ అనడంతో జయ టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఇషిక, వీరుని జయ కలుస్తుంది. పోటీ గురించి చెప్పి ఎలాగైనా గంగ ఓడిపోవాలని, ఫైనల్ లో గంగతో పోటీ పడితే తనే గెలుస్తుందని, అలా కాకుండా చూడమని చెప్తుంది. మరోవైపు గంగ ఇష్టం వచ్చినట్లు తింటుంటే రుద్ర వచ్చి కోప్పడతాడు. తనని ఎత్తుకుని అరవై ప్లస్ ఉంటావని చెప్తాడు. వెయిట్ మెషిన్ లో చూస్తే అంతే ఉండడంతో అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు సర్ అని గంగ ఆశ్చర్యంగా చూస్తుంది.
అప్పుడే రంగాకి డాక్టర్ ఫోన్ చేసి బాలకృష్ణ స్పృహలోకి వచ్చాడని చెప్తాడు. వెంటనే ఫోన్ రుద్రకి ఇస్తాడు రంగా. స్పృహలోకి వచ్చి పేపర్ పై గంగ స్కెచ్ అని ఏదో రాశాడు.. మళ్లీ స్పృహ కోల్పోయాడని డాక్టర్ చెప్తాడు. దీంతో రుద్ర షాక్ అవుతాడు. ఆ తర్వాత జయని ప్రాక్టీస్ కి విశ్వ తీసుకొని వస్తాడు. అక్కడికే గంగని తీసుకుని రుద్ర వెళ్తాడు. జయ రన్నింగ్ ఫాస్ట్ గా చేస్తుంటే విశ్వ మెచ్చుకుంటాడు. ఇద్దరు పోటీదార్లు ఒకే చోట ప్రాక్టీస్ చేయడంతో టెన్షన్ మరింత పెరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





.webp)
