Home

»

Tv News

Jayam serial: రుద్ర ప్లాన్ కి బుక్కైన వీరు.. బాలకృష్ణ కోసం స్కెచ్ బెడిసికొట్టింది!

Oct 2, 2026 11:14AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం' . ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-388లో..  రుద్ర దగ్గరికి గంగ వెళ్తుంది. నేను బాలకృష్ణ దగ్గరికి వెళ్తున్నానని రుద్ర చెప్తాడు. నేను వస్తానని గంగ అనగా వద్దని రుద్ర అంటాడు. అయినా సరే వస్తానని గంగ పట్టుబట్టడంతో సరే అంటాడు. ఈ మాటలు వీరు విని త్వరగా ఇషిక దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు రుద్ర, గంగ ఆ బాలకృష్ణ దగ్గరికి వెళ్తున్నారు. నేను వాళ్ల కార్ వెనకాల ఉంటాను.. అప్పుడు బాలకృష్ణ ఎక్కడ ఉన్నాడో తెలుస్తుందని వీరు అంటాడు. వాళ్లు కార్ ఎక్కే టైంకి నువ్వు వాళ్లని డైవర్ట్ చెయ్ అని ఇషికతో వీరు చెప్తాడు.

 ఆ తర్వాత రుద్ర, గంగ వెళ్తుంటే.. ఎక్కడికి వెళ్తున్నారని ఇషిక అడుగుతుంది. ఎందుకని గంగ అనగా.. నాకు తలనొప్పిగా ఉంది.. టాబ్లెట్ తీసుకొని వస్తారా అని ఇషిక నాటకం ఆడుతుంది. ఇంట్లో ఉన్నాయి కదా అని గంగ అనగానే అవునా సరే అని ఇషిక అంటుంది. ఆలోపే వీరు రుద్ర కార్ ఎక్కుతాడు. రుద్ర ఒక బిల్డింగ్ దగ్గరికి వెళ్లి ఆగి లోపలికి వెళ్తాడు. ఇందులోనే ఆ బాలకృష్ణ ఉండి ఉంటాడని వీరు కార్ దిగుతాడు. గంగ, రుద్ర బిల్డింగ్ లోపలికి వెళ్లి మళ్లీ సైలెంట్ గా వచ్చి కార్ లో వెళ్లిపోతారు.

కొద్ది దూరం వెళ్లాక.. ఏం చేస్తున్నారని గంగ అడుగుతుంది. ఆ వీరు కార్ లో వచ్చాడు.. వాళ్లు మాట్లాడుకున్నప్పుడు వీరు వినడం నేను చూశాను.. అందుకే ఆ బిల్డింగ్ కి వెళ్లాను.. అందులో ఒక పిచ్చోడు ఉంటాడు.. ఇప్పుడు వీరు అందులోకి వెళ్లి ఉంటాడని రుద్ర చెప్తాడు. అటు వీరు ఆ బిల్డింగ్ లోకి వెళ్లగానే అక్కడ ఒక పిచ్చోడు.. నా ఇంటి పత్రాల కోసం వచ్చావా అని వెంబడిస్తుంటే వీరు భయంతో పరిగెత్తుతాడు. అప్పుడే ఇషిక కార్ తో వస్తుంది.. వెంటనే తన కార్ లోకి ఎక్కుతాడు. చూసావా బ్రో, కావాలనే రుద్ర బావ ఇదంతా చేశాడని ఇషిక అంటుంది.

మరోవైపు వంశీ బైక్ పై జయ రావడం చూసి విశ్వ కోప్పడతాడు. పెళ్లికి ముందు ఇలా రావడం ఏంటి.. అందరూ ఏమనుకుంటారని అంటాడు. సారీ మావయ్య అని వంశీ చెప్తాడు. వంశీ వెళ్తుంటే.. సారీ వంశీ, మనం అప్పుడప్పుడు కలుద్దామని జయ యాక్టింగ్ చేస్తుంది. మరోవైపు బాబు బారసాల గురించి మంచి రోజు కోసం శకుంతల పంతులిని పిలుస్తుంది. మరి బాలకృష్ణ ఆచూకీ రుద్ర, వీరులలో ఎవరికి ముందు దొరుకుతుంది? వంశీ, జయ పెళ్లి సజావుగా జరుగుతుందా లేదా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

[Jayam Serial Today Episode 388, Jayam Zee Telugu, Rudra Ganga Plan, Veeru Ishika]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com