Home

»

Tv News

బాబుని ఎత్తుకున్నందుకు రంగాని అవమానించిన శకుంతల.. రుద్ర సీరియస్!

Oct 1, 2026 10:57AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న 'జయం' . ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్- 387లో.. ప్రీతి బాబుని ఎత్తుకుని రంగా ఆడిస్తుండగా శకుంతల చూసి ఫైర్ అవుతుంది. ఎందుకు బాబుని ఎత్తుకున్నావ్ ఆ మురికి చేతులతో నువ్వు ఈ ఇంట్లో జీతం లేని పనిమనిషివి.. అంతలోనే ఉండు.. ఎక్కువ చొరవ తీసుకోకు.. నువ్వు ఎప్పుడూ పరాయి వాడివే అని కోప్పడుతుంది. అప్పుడే ఇషిక, వీరు వచ్చి ఏమైందని అడుగుతారు. నువ్వు బాబుని చూసుకోకుండా ఏం చేస్తున్నావని శకుంతల అనగానే ఇప్పుడు అలా వెళ్లను అత్తయ్యా అని వీరు అంటాడు.

ఆ తర్వాత రంగా బయట బాధపడుతుంటే గంగ వచ్చి ఏమైందని అడుగుతుంది. మొదట చెప్పని రంగా.. నా మీద ఒట్టే అని గంగ అనడంతో జరిగింది చెప్తాడు. నిన్ను అన్ని మాటలు అనడానికి నోరు ఎలా వచ్చిందని గంగ ఫైర్ అవుతుంది. అప్పుడే రుద్ర వచ్చి వింటాడు. ఏం లేదు బావా అని రంగా దాచే ప్రయత్నం చేసినా రుద్ర వినకుండా లోపలికి వెళ్తాడు. బాబుని ఎత్తుకుని..‌ప్రీతి నీకు రంగా బాబుని ఎత్తుకోవడం ఇష్టం లేదా అని నిలదీస్తాడు. తనే బాబు ఏడుస్తుంటే ఎత్తుకుని హెల్ప్ చేశాడు, అలాంటిది ఎందుకు వద్దు అంటానని ప్రీతి కవర్ చేస్తుంది.అప్పుడు శకుంతల అన్న మాటలను రుద్ర బయట పెడతాడు. నేను బాబుకి ఇన్ఫెక్షన్ అవుతుందని అలా అన్నానని శకుంతల మాట మారుస్తుంది. దీంతో రుద్ర సీరియస్ అవుతాడు. రంగా ఈ ఫ్యామిలీకి ఎంత చేస్తున్నాడో తెలుసా.. నాకు ఏమైనా అయితే తన ప్రాణం అడ్డుపెడతాడని గొప్పగా చెప్తాడు. పెద్దసారు కూడా.. శకుంతల నువ్వు రంగాకి సారీ చెప్పమని అంటాడు. అయ్యో అవన్నీ ఎందుకని రంగా అందరిని పంపిస్తాడు. ఆ తర్వాత రుద్రని హగ్ చేసుకుంటాడు.

మరోవైపు రెస్టారెంట్ లో వంశీ వెయిట్ చేస్తుంటే జయ వస్తుంది. వంశీని పూర్తిగా తన మాయలో పడేయాలని జయ ట్రై చేస్తుంది. ఇంకోవైపు.. మీరు చాలా మంచివారు.. మా అన్నయ్యకి సపోర్ట్ గా ఉన్నారని రుద్రతో గంగ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com