Home

»

Tv News

Jayam: వంశీని రెచ్చగొట్టిన జయ.. కాఫీ షాప్ లో సర్ ప్రైజ్ గిఫ్ట్!

Sep 27, 2026 12:08PM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ - 384లో..  వీరు దగ్గరికి ఇషిక వచ్చి మాట్లాడుతుంది. ఏంటి బ్రో ఏదో చేయబోయి ఏదో చేసినట్లు ఉన్నావ్.‌. ప్లాన్ ఫెయిల్ అయినట్లు ఉందని ఇషిక అనగానే వీరుకి కోపం వస్తుంది. వీరు తను ఏం చేయాలనుకున్నదీ చెప్తాడు. మరోవైపు వంశీని కాఫీ షాప్ లో జయ కలుస్తుంది.

వంశీ కంటే ముందే వెళ్లి కాఫీ షాప్ లో జయ వెయిట్ చేస్తుంది. లేట్ అయ్యానా అని వంశీ అడుగుతాడు. ఇష్టమైన వాళ్ల కోసం వెయిట్ చేయడం తప్పు కాదు, నేనే ముందు వచ్చానని జయ అంటుంది. నీకొక సర్ ప్రైజ్ అంటూ వంశీకి చైన్ గిఫ్ట్ ఇస్తుంది. సారీ నేను ఏం తీసుకొని రాలేదని వంశీ అంటాడు. పర్లేదులే, మా ఇంట్లో అంటే అంతా నా ఇష్టం జరుగుతుంది. మీ ఇంట్లో అలా కాదుగా అంతా మీ అన్నయ్య ఇష్టం జరుగుతుందని జయ అంటుంది.

నేనేదో మీ మధ్య గొడవ పెట్టాలని కాదు.. మీ నాన్న మావయ్య మాటలు విన్నట్లు మీరు మీ అన్నయ్య మాటలు వింటారని జయ అంటుంది. ఇప్పుడే ఈ చైన్ నీ మెడలో వేస్తానని జయ వేస్తుంది‌. దాంతో వంశీ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇది నేను కొన్నానని చెప్పకు.. మీ వాళ్లు ఏదోలా అనుకుంటారని జయ కావాలనే రెచ్చగొట్టినట్లు మాట్లాడుతుంది.

జయ మాటల వెనుక ఉన్న ప్లాన్ ఏంటి..వంశీని అన్నయ్యకు దూరం చేయాలని చూస్తుందా.. వీరు ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో ఇషిక ముందు ఏం చేయబోతున్నాడనేది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.



[Jayam Serial Today Episode 384, Jayam Zee Telugu Latest Episode, Jaya Vamsi Coffee Shop Gift, Jayam September 26 episode]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com