(1).webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం శుక్రవారం నాటి ఎపిసోడ్ 383లో..జయ బాక్సింగ్ లో గెలవాలని సుధా అభిషేకం చేస్తానని మొక్కుకుంది. అయితే బిందెతో నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చెయ్యలేనని జయ కాలు బెణికినట్లు యాక్టింగ్ చేస్తుంది. దీంతో నేనే చేస్తానని సుధా కోనేరు నుంచి వాటర్ తీసుకొని వెళ్లి లింగానికి అభిషేకం చేస్తుంది. అదంతా రుద్ర, గంగ చూస్తారు. గంగ వెళ్లి.. అమ్మ మీకెందుకు శ్రమ, నేను నీళ్లు తెస్తాను మీరు అభిషేకం చెయ్యండి అనగానే అవసరం లేదని సుధా అంటుంది.
జయ మాత్రం గుడిలో ఫొటోస్ దిగుతూ ఎంజాయ్ చేస్తుంటుంది. ఆ తర్వాత సుధాకు కళ్ళు తిరిగి కోనేటిలో పడిపోతుంది. వెంటనే గంగ వెళ్లి ప్రాణాలకు తెగించి కాపాడుతుంది. తన తల్లి అంటే ఎంత ప్రేమ ఉందో, ప్రాణాలకు తెగించి కాపాడిందని చుట్టుపక్కల వాళ్ళు అంటుంటే తన కూతురు నేనే అని జయ అంటుంది. మరి ఏం పట్టనట్లు ఉన్నావని వాళ్ళు జయను నిలదీస్తారు. అప్పుడే రుద్ర వచ్చి.. ఏమైంది అత్తయ్య, ఇవన్నీ ఎందుకని అంటాడు. జయ పక్కకి వెళ్తుంటే తన వెనకాలే గంగ కూడా వెళ్తుంది. మీ మావయ్య చాలా పట్టుదలగా ఉన్నాడురా, నువ్వైతే నేను పుట్టింటికి దూరం కాకుండా చూడమని రుద్రతో సుధా అంటుంది. ఆ తర్వాత జయ దగ్గరికి గంగ వెళ్లి.. ఇదంతా యాక్టింగ్ అని తెలుసని కోప్పడుతుంది.
మరోవైపు జయ కోసం విశ్వ ఇంట్లో వెతుకుతాడు. గుడికి వెళ్లారని లక్ష్మి చెప్తుంది. ప్రాక్టీస్ ఉండగా ఇదంతా ఏంటని విశ్వ కోప్పడతాడు. అప్పుడే సుధా, జయ ఇంటికి వస్తారు. సుధాకు ఉన్న గాయం చూసి ఏమైందని విశ్వ అడుగుతాడు. జరిగింది చెప్పడంతో విశ్వ తిడతాడు. ఎలాగైనా గెలవాలని బీపీ పెంచుకుంటాడు. విశ్వ అలా బిహేవ్ చేస్తుంటే సుధాకు భయం వేస్తుంది.
మరోవైపు వీరు దగ్గరికి ఇషిక వచ్చి.. ఏంటి బ్రో ప్లాన్ ఫెయిల్ అయినట్టు ఉందని అంటుంది. ఇషిక, వీరు ప్లాన్ ఏంటి, జయ బాక్సింగ్ గెలుపును ఆపడానికి వాళ్ళు ఏం కుట్ర చేస్తున్నారనేది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





(1).webp)
