(6).webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-382 లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. బాలకృష్ణని చంపడానికి వీరు మాస్క్ పెట్టుకుని హాస్పిటల్ కి వెళ్తాడు. బెడ్ పై ఉన్న వ్యక్తిని దిండుతో ఊపిరి ఆడకుండా చేయబోతాడు. తీరా చూస్తే అక్కడ ఉన్నది బాలకృష్ణ కాదు, రుద్ర. రుద్రను చూసి వీరు షాక్ అవుతాడు.
ఏంటి నిద్రపోతుంటే డిస్టబ్ చేస్తున్నావని రుద్ర అడుగుతాడు. నువ్వేంటి వీరు ఇక్కడ అని రుద్ర ప్రశ్నిస్తాడు. దానికి వీరు బాబు బర్త్ సర్టిఫికెట్ కోసం వచ్చానని అబద్ధం చెప్తాడు. అబద్దం చెప్పకు వీరు, నువ్వు బాలకృష్ణని చంపడానికి వచ్చావని రుద్ర నిలదీస్తాడు. దానికి వీరు కూడా సైలెంట్ గా ఉండకుండా అవును చంపడానికే వచ్చాను.. ఇప్పుడు ఏం చేస్తావని ఎదురు తిరుగుతాడు. దానికి రుద్ర కూడా గట్టి కౌంటర్ ఇస్తాడు. బాలకృష్ణని ఇక్కడి నుంచి తీసుకెళ్లాను.. నీకు దొరకనంత దూరం తీసుకెళ్లానని చెప్తాడు. అతను బాగయ్యాక అతని సాక్ష్యం తీసుకుని నిన్ను బయటకు రాకుండా చేస్తానని రుద్ర వార్నింగ్ ఇస్తాడు. దీంతో వీరు కోపంగా ఉండిపోతాడు. ఆ తర్వాత రంగాకి రుద్ర ఫోన్ చేసి బాలకృష్ణ సేఫ్ గా ఉన్నాడా అని అడుగుతాడు. సేఫ్ గా ఉన్నాడు.. నేను చూసుకుంటాను కదా బావా అని రంగా చెప్తాడు.
మరోవైపు జయ పోటీలో గెలవాలని జయని తీసుకుని సుధా గుడికి వస్తుంది. అదే సమయంలో రుద్రని తీసుకుని గంగ కూడా గుడికి వస్తుంది. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అని రుద్ర అంటే మనపై చాలా నెగెటివ్ దృష్టి ఉంది. వెళ్లాలి సర్ అని గంగ అంటుంది. ఆ తర్వాత అర్చన చేయమని పంతులుకి సుధా చెప్తుంది. పంతులు వచ్చి గోత్రం, పేర్లు చెప్పమని అడుగుతాడు. విశ్వ, సుధా అని చెప్పగానే అమ్మాయి పేరేంటని పంతులు అడుగగా అప్పుడే కార్ లో నుండి గంగ దిగి రావడం చూసి గంగ అని సుధా చెప్తుంది. దాంతో గంగ పేరుతోనే పంతులు అర్చన చేస్తాడు. అమ్మ నా పేరు చెప్పకుండా గంగ పేరు చెప్పావేంటని జయ అంటే కంగారులో చెప్పానులే అని సుధా అంటుంది. ఆ తర్వాత రుద్ర, గంగ వాళ్ళ దగ్గరికి వస్తారు. సుధా, గంగ రుద్రల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. మరోవైపు ఇషిక, వీరు మాట్లాడుకుంటారు. ఎందుకు వీరు ఇలా చేశావ్.. నువ్వు జైలుకి వెళ్తే ఎలా అని అడుగుతుంది. ఆ బాలకృష్ణ బ్రతికి ఉంటే నా గురించి నిజం చెప్పేస్తే నేను జైలుకే కదా.. అందుకే చంపడానికి వెళ్ళానని వీరు చెప్తాడు. ఒకవేళ నేను జైలుకి వెళ్ళినా నా ప్లాన్ బి అమలు చేయాలని ఇషికతో అతని ప్లాన్ చెప్తాడు. ఏంటంటే వంశీ, జయలని ఒక్కటి చేయాలి.. వంశీని శారీరకంగా, మానసికంగా దగ్గర చేయాలి.. అప్పుడు రుద్ర ఏం చేయలేడు. అందరు మన చేతుల్లో ఉన్నట్టే అని ఇషికతో వీరు ప్లాన్ చెప్తాడు. మరోవైపు గుడిలో ఉన్న జయ, గంగ కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తారు. గంగ కొడితే కొబ్బరిలో పూవు వస్తుంది. జయ కొడితే కుళ్ళిపోయి ఉంటుంది. ఇక పంతులు దగ్గరికి గంగ కొబ్బరి తీసుకుని వెళ్తుంది. అది చూసిన పంతులు.. మీరు బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలో విజయం సాధిస్తారని అంటాడు. నీ కొబ్బరి ఏదని అడుగగా కుళ్ళిపోయిందని జత అంటుంది. ఆ తర్వాత అందరికి దీపం ఇస్తుండగా జయ దీపం తీసుకుంటుండగా అది ఆరిపోతుంది. నా మనసు ఎందుకో కీడు శంకిస్తుందని సుధా అనగానే నేను పరిహారం చెప్తాను కదా అమ్మ అని పంతులు చెప్తాడు. గుడిచుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయాలి.. కోనేరులో ఉన్న నీటితో పదకొండు సార్లు శివుడికి జలాభిషేకం చేయాలని పంతులు చెప్తాడు. నా కూతురు బాక్సింగ్ లో గెలవాలని నేను చేస్తానని సుధా అనగానే మీరు కాదు మీ కూతురు అని పంతులు చెప్తాడు. ఆ తర్వాత సుధా, జయ గుడిచుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. పది సార్లు జయ గుడిచుట్టూ తిరిగాక అలసిపోయినట్టు యాక్ట్ చేసి పడిపోతుంది. దాంతో సుధా కంగారుపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Jayam, Jayam Episode 382, Zee Telugu Serial, Veeru, Rudra, Balakrishna, Jaya, Ganga, Sudha, Ishika]





(3).webp)
