Home

»

Tv News

Jayam serial : గంగ-రుద్రల మధ్య చిగురిస్తున్న ప్రేమ.. విశ్వకి ఎదురుచూపులు!

Aug 14, 2026 9:40AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -346 లో.....పెద్దసారు ఇంటికి  విశ్వ కుటుంబంతో వస్తాడు. గంగ నువ్వు వెళ్లి అందరికి టీ స్నాక్స్ తీసుకొని రా అని శకుంతల చెప్పగానే గంగ సరే అని అంటుంది. నేను వెళ్లి వదినకి హెల్ప్ చేస్తానని స్నేహ వెళ్తుంటే ఒక్కతి చేసుకోగలదు.. ఇంటి కోడలు ఆ మాత్రం చేసుకోలేదా అని శకుంతల అంటుంది. అయితే మీరు ఇషికకి ఎందుకు పనులు చెప్పట్లేదని విశ్వ అడుగుతాడు. కావాలనే గంగకి పనులు చెప్తున్నారని విశ్వ అంటాడు.

అదేం లేదని శకుంతల అంటుంది. కాబోయే బాక్సింగ్ ఛాంపియన్ తను.. తనకి పనులు చెప్పడం బాగాలేదు వదిన అని సుధా అంటుంది. నేను వెళ్లి తనకి హెల్ప్ చేస్తానని సుధా వెళ్ళబోతుంటే వద్దు అమ్మ నేను వెళ్తానని  లక్ష్మీ, పైడిరాజు ఇద్దరు గంగకి సాయంగా కిచెన్ కి వెళ్తారు. అప్పుడే గంగ కిచెన్ లో ఏదో ఆలోచిస్తూ చెయ్ కాల్చుకుంటుంది. అప్పుడే రుద్ర వచ్చి అయ్యో చూసుకోవాలి కదా గంగ అంటూ ఆంటీమెంట్ రాస్తాడు. అది చూసి గంగ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.

 

మరొకవైపు పంతులు ఇంటికి వస్తాడు. అమ్మాయి , అబ్బాయి జాతకాలు చూస్తాడు. అబ్బాయి జాతకం బాగుంది.. అమ్మాయి జాతకంలో చికాకులున్నాయని చెప్తాడు. ఒకసారి చేతి రేఖలు చూస్తానని పంతులు జయ చేతి రేఖ లు చూస్తాడు. ఈ జాతకానికి రేఖలకి మ్యాచ్ అవ్వడం లేదని పంతులు చెప్తాడు. ఈ జాతకాలు ఏముంది అంటూ వీరు డైవర్ట్ చేయాలని చూస్తాడు. కానీ పెద్దసారు ఫాలో అవ్వాలని అంటాడు. నాకు ఇలాంటివి నచ్చవని విశ్వ అంటాడు‌. ఇక రుద్ర కవర్ చేస్తాడు.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com