Home

»

Tv News

Jayam serial : రామనాథం మృతి వెనుక షాకింగ్ నిజాలు.. శకుంతలకు దడ పుట్టిస్తున్న ట్విస్ట్!

Aug 9, 2026 11:21AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -342 లో.....శకుంతల ఇంటికి కంగారుగా వస్తుంది. ఏమైందని పెద్దసారు అడుగుతాడు. శకుంతల టెన్షన్ పడుతూ ఎవరో రామనాథం గారట ఆయనకి ఆక్సిడెంట్ అయి నా ముందే చనిపోయాడని శకుంతల చెప్పగానే వీరు టెన్షన్ పడుతాడు. అప్పుడే రంగ, గంగ రుద్ర వస్తారు. పెద్దమ్మ రంగనాథం గారు ఏదో చెప్పారంట.. ఏం చెప్పారని రుద్ర అడుగుతాడు.

శకుంతల అతను చెప్పింది చెప్పబోయి ఆగిపోతుంది. నాకు చెప్పలేదు చెప్పే ప్రయత్నంలోనే అతను చనిపోయాడని శకుంతల చెప్తుంది. దాంతో వీరు రిలాక్స్ అవుతాడు. రుద్ర మళ్ళీ మళ్ళీ అడుగుతుంటే ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి కాసేపు వదిలెయ్యండి అని శకుంతల కోప్పడుతుంది. ఆ తర్వాత నువ్వు సేఫ్ బ్రో అని వీరుతో ఇషిక అంటుంది. అవును ఇషిక వాడిని చంపి మంచి పని చేసానని వీరు అంటాడు. మరొకవైపు బావ నువ్వు గంగని పరాయి దానిలాగా చూస్తున్నావ్.. తను ఎంత బాధపడుతుందో ఆలోచించావా అని రుద్రతో రంగ అంటాడు.

నేను అలా అని ఆపకుంటే గంగ ఇంకా మాట్లాడేది. దాంతో గంగ, పెద్దమ్మకి మధ్య గొడవ జరిగేది. గంగకి నేను ఇంటికి వచ్చాక అర్థమయ్యేలా చెప్పగలనని రుద్ర అంటాడు. నాకు అన్ని నిజాలు తెలిసి కూడా నేను సైలెంట్ ఎందుకున్నాను అంటే దాని తర్వాత జరిగే ప్రమాదం నాకు తెలుసు అని రుద్ర అంటాడు. సారీ బావ నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానని రంగ అంటాడు. అదంతా గంగ విని రుద్రని వచ్చి హగ్ చేసుకొని సారీ సర్ తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్తుంది. నీకు కాన్సంట్రేషన్ మొత్తం ఒక్క దానిపై మాత్రమే ఉండాలని రుద్ర అనగానే సరే అని గంగ అంటుంది. ఆ తర్వాత రంగ, గంగ, రుద్ర మాట్లాడుకుంటారు. ఎలాగైనా సరే ఈ మిస్టరీని కనిపెట్టాలని రుద్ర చెప్తాడు. విశ్వ సర్ కూతురు గంగే అని బావకి చెప్పాలి.. ఎప్పుడు చెప్పే పరిస్థితి వస్తుందో చూడాలని రంగ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com