జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -271 లో......గంగని బుజ్జగించి రుద్ర ఇంటికి తీసుకొని వెళ్తుంటే అప్పుడే విశ్వ ఎదురుపడుతాడు. ఇటువైపుగా వచ్చాము.. దాహం వేసింది అందుకే లోపలికి వచ్చామని చెప్పి అక్కడ నుండి రంగా, గంగ బయట పడతారు. సర్ మీ షర్ట్ బాగుంది.. మేడం సెలక్షన్ అనుకుంటా అని రుద్ర అంటాడు. విశ్వ సైలెంట్ గా చూస్తాడు. రుద్ర వెళ్ళిపోతాడు. అందరు బయట ఉన్న కార్ దగ్గరికి వచ్చాక.. పాపం మేడం వాళ్ళ కూతురు ఎక్కడున్నా కనుక్కోవాలి సర్ అని రుద్రతో గంగ చెప్తుంది.
గంగ అక్కడ నుంచి వెళ్ళాక గంగ పేరెంట్స్ ఎవరో కూడా కనుక్కోవాలని లక్ష్మీ వాళ్ళతో రుద్ర అంటాడు. ఆ తర్వాత విశ్వ లోపలికి వచ్చాక రుద్రకి నువ్వు అత్తయ్య అని తెలిసింది కదా అని కోప్పడతాడు. అవునన్నట్టుగా సుధా సైలెంట్ గా ఉంటుంది. అసలు వాళ్ళకి నువ్వు దగ్గర కాకుండా ఉండాలంటే నేనేం చెయ్యాలి.. ఏం చేయమన్నా చేస్తానని విశ్వ అంటాడు. ఏం అడిగినా చేస్తారా అని సుధా అడుగుతుంది. చేస్తాను నీ మీద ఒట్టు అని విశ్వ అనగానే నా కూతురుని నాకు తీసుకొని వచ్చి ఇవ్వండి. అప్పుడు ఆ కుటుంబం దగ్గర వెళ్ళనని సుధా అనగానే విశ్వ షాక్ అవుతాడు. సుధాకి కూతురిని తీసుకొని వచ్చి ఇచ్చేస్తే వాళ్ళ జోలికి వెళ్ళదు.. ముందు ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ ఉందో కనుక్కోవాలని విశ్వ అనుకుంటాడు. గతంలో పాపని ఇచ్చిన సీతారాములుకి ఫోన్ చేస్తాడు విశ్వ. అర్జెంట్ గా నన్ను కలవు.. మాట్లాడాలని విశ్వ అనగానే అతను సరే అంటాడు.
మరొకవైపు శకుంతల చేతి ఆవకాయ పచ్చడి కావాలని సుధా అడిగినందుకు శకుంతల చేత ఆవకాయ పచ్చడి పెట్టించడానికి గంగ, రుద్ర ప్లాన్ చేసి ఒప్పిస్తారు. ఆ తర్వాత ఇషిక, సూర్య సంతోషంగా ఆఫీస్ నుంచి ఇంటికి ఇంట్లో అందరికి స్వీట్ ఇస్తారు. ఒక ప్రాజెక్ట్ పై సంతకం పెట్టానని ఇషిక చెప్తుంది. ముందు వెనకాల ఆలోచించరా అని పెద్దసారు అడుగుతాడు. మనకు ప్రాఫిట్ చూసుకొని ఒకే చేసానని ఇషిక అంటుంది. ఆ ప్రాజెక్ట్ మనకి సెట్ అవ్వదని రుద్ర అంటాడు. సెట్ అవుతుందని రుద్రకి వ్యతిరేఖంగా సూర్య మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




