
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-327 లో....శకుంతల గుడికి అని చెప్పి కార్తీక్ ని చూడడానికి వెళ్తుంది. ఆ తర్వాత కాసేపటికి రుద్ర, పెద్దసారు మార్ట్ కి వెళ్తారు. వాళ్ళని చూసి ఈ రోజు ఏంటి అందరు మార్ట్ కి వస్తున్నారు. ఇందాకే అత్తయ్య వచ్చిందని రుద్ర వాళ్ళతో ప్రమీల అంటుంది. కార్తీక్ తో ప్రమీల మాట్లాడుతుంటే.. రుద్ర వాళ్ళు కూడా వెళ్తారు. జరిగిన దానికి శకుంతల సారీ చెప్తుంది. మీరు నాకు సారీ చెప్పడం ఏంటమ్మా అని కార్తీక్ అనగానే శకుంతల హ్యాపీగా ఫిల్ అవుతుంది.
కార్తీక్ కళ్ళు చూసి శకుంతల మాట్లాడుతూ భానుతో మాట్లాడినట్లు ఫీల్ అవుతుంది. ఆ తర్వాత కాసేపటికి పెద్దసారు, రుద్ర, శకుంతల గుడికి బయల్దేరదామని అనుకుంటారు. ఏవండీ ఇప్పుడే కార్తీక్, ప్రమీల పెళ్లి గురించి మాట్లాడండి అని రుద్రతో గంగ అనగానే టైమ్ చూసుకొని అడుగుతానని రుద్ర చెప్తాడు. ఆ తర్వాత శకుంతల పెద్దసారు ఇద్దరు కార్తీక్ గురించి మాట్లాడుకుంటారు. కార్తీక్ భాను లాగే చాలా మంచివాడని అనుకుంటారు. నాకు ఒక ఆలోచన వచ్చింది. కార్తీక్ గుణంలో కూడా మంచివాడు.. అందుకే కార్తీక్ , ప్రమీల ఇద్దరికి పెళ్లి చేద్దామని పెద్దసారు శకుంతలతో అంటాడు. మనం అడుగుదాం అనుకుంది పెద్దోరు అడిగారని గంగ హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ శకుంతల వద్దని అంటుంది. ప్రమీల ఎప్పుడు భాను భార్యగానే ఉండాలి. ఒక కళ్ళు మాత్రమే భానువి తను భాను కాదని శకుంతల అంటుంది.
ఇంకెప్పుడు అలా అనొద్దని పెద్దసారుపై శకుంతల కోప్పడుతుంది. మరొకవైపు ఆటో డ్రైవర్ కూతురికి మంచి ఉద్యోగం వచ్చిందట అని ఫోన్ లో వచ్చిన న్యూస్ ని లక్ష్మీ, పైడిరాజులకి సుధా చూపిస్తుంది. రేపు గంగ కూడా ఇలాగే వస్తుందని సుధా చెప్తుంటే మా కంటే ఎక్కువ మీరే హ్యాపీగా ఉంటారు అమ్మ అని లక్ష్మీ అంటుంది. తరువాయి భాగంలో ప్రమీలని కొంతమంది రౌడీలు ఏడిపిస్తారు.. పెద్దసారు అడ్డువెళ్లితే తనపై చెయ్ చేసుకుంటారు. ఆ విషయం రుద్రకి తెలిసి గంగని తీసుకొని వెళ్లి ఇప్పుడు బాక్సింగ్ ప్రాక్టికల్ చెయ్ అని అంటాడు. దాంతో రౌడీలని గంగ కొడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)

