.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -329 లో..... పెద్దసారు, ప్రమీల ఇద్దరు ఇంటికి వచ్చి మార్కెట్ లో జరిగింది మొత్తం చెప్తారు. ఆ మాటలన్నీ రుద్ర వింటాడు. గంగ, రంగాని తీసుకొని రుద్ర మార్కెట్ కి వెళ్తాడు. రుద్రకి రంగా కుర్చీ వేసి కూర్చొమని చెప్తాడు. ఏంటి అన్నా రోడ్డు పైన కుర్చీ వేసావని గంగ అడుగుతుంది. నువ్వు ఉకో చెల్లి అని రంగా అంటాడు.
గంగ నీకు ప్రాక్టీస్ సెషన్ ఉంది అని చెప్పాను కదా ఇప్పుడు నువ్వు ప్రాక్టికల్ గా చెయ్యాలి. ఆ రౌడీలతో నీకు వచ్చిన బాక్సింగ్ మొత్తం చూపించమని రుద్ర అంటాడు. నేను వాళ్ళని కొట్టడం ఏంటని గంగ అంటుంది. ప్రమీల ని ఏడిపించారు చెల్లి.. మావయ్య గారిపై చెయ్ చేసుకున్నారని రంగా అనగానే గంగ కోపంతో వాళ్ళని కొడుతుంది. వాళ్ళని తీసుకొని ఇంటికి వెళ్తారు. వాళ్ళచేత పెద్దసారు, ప్రమీలలకి సారీ చెప్పిస్తాడు రుద్ర. అక్క మాములుగా కొట్టలేదు బాక్సింగ్ లో నువ్వే విన్ అవుతావని రౌడీలు చెప్తారు. వాళ్ళు వెళ్ళాక శబాష్ రుద్ర మంచి పని చేసావని పెద్దసారు అంటాడు. నేను కచ్చితంగా పోటీలో గెలిచి.. మీ పేరు నిలబెడతానని గంగ అంటుంది. మరొకవైపు ధీరజ్ రౌడీలతో మాట్లాడతాడు.
మనం ఆ గంగ, రుద్రని దెబ్బకొట్టాలంటే ఇప్పుడు కచ్చితంగా మనకి స్ట్రాంగ్ పార్టనర్ కావాలని ధీరజ్ అంటాడు. అప్పుడే ఇషిక, వీరు వచ్చి ధీరజ్ తో మాట్లాడతారు. ముగ్గురికి గంగ, రుద్ర పైన పగ ఉంటుంది. అది తీర్చుకోవాలని ముగ్గురు చెయ్ కలుపుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
