Home

»

Tv News

Jayam serial: వంశీ, జయ రొమాన్స్.. రుద్ర మాస్టర్ ప్లాన్.!

Oct 25, 2026 12:16PM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-408 లో.. కోమాలో ఉన్న బాలకృష్ణని చూడటానికి పెద్దసారు, శకుంతల, గంగ వస్తారు. ఆ తర్వాత ఇంటికి వస్తారు.‌ ఇక ఇంట్లో వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారని అడుగుతారు. నిజం చెప్పకుండా శకుంతల, పెద్దసారు కవర్ చేస్తారు. రుద్ర టైర్డ్ గా ఉందని చెప్పి తన గదిలోకి వెళ్తాడు. అప్పుడే కాఫీ తీసుకొని వస్తుంది గంగ. అది చూసి ఆ కాఫీ నీ మీద పోసుకో అని కోపంగా గంగ మీద అరుస్తాడు రుద్ర. ఏంటండి ఏమైందని గంగ అడుగగా.. నీ మొహం అయిందని అంటాడు. 

శకుంతల పెద్దసారు వాళ్ళని ఎందుకు తీసుకొచ్చావని గంగ మీద రుద్ర సీరియస్ అవుతాడు. పెద్దసారు బలవంతం చేశారని గంగ చెప్పగానే అక్కడికి వీరు వచ్చాడని రుద్ర చెప్పగానే గంగ షాక్ అవుతుంది. నేను మాట్లాడేటప్పుడు ఇంట్లో ఎవరు లేరని గంగ చెప్పగా వాడు ఏదో మూలన దాక్కొని విని, డ్రైవర్ సర్దార్ జీ గెటప్ లో వచ్చాడని రుద్ర అనగానే గంగ షాక్ అవుతుంది. ఆ తర్వాత బాలకృష్ణ ప్లేస్ ని మార్చేశామని, ఇంకెప్పుడు గంగతో ఈ విషయం చెప్పకూడదని అనుకుంటారు. 

ఆ తర్వాత వీరు దగ్గరికి శకుంతల వెళ్తుంది. మన ప్లాన్ ఇలా తెలిసిపోయిందని శకుంతల అంటుండగా అక్కడికి రుద్ర రావడం గమనించి మాట మారుస్తుంది శకుంతల‌. తర్వాత వీరు, రుద్ర మధ్య మాటల యుద్ధం మొదలవుతుంది. మరోవైపు వంశీ, జయ ఇద్దరు ఎవరూ లేని ఒంటరి చోటుకి వెళ్తారు. అక్కడికి రుద్ర, గంగ కార్ లో వస్తారు‌.  జయ, వంశీ ఇద్దరు మరో కార్ లో ఉంటారు‌. అక్కడ ఎవరూ ఉండకపోవడంతో జయ, వంశీ కిస్ చేసుకోబోతుండగా అప్పుడే ముగ్గురు రౌడీలు అక్కడికి వస్తారు. ఇక జయని, వంశీని కార్ లో నుండి లాక్కొని బయటకి తీసుకెళ్తారు. 

జయను ఒక రౌడీ బలవంతం చేస్తుండగా అప్పుడే గంగని వెళ్ళమని చెప్తాడు రుద్ర. అదంతా రుద్ర ఫోన్ లో వీడియో తీస్తుంటాడు. ఇక గంగ వెళ్ళి రౌడీలని కొట్టి పంపించేస్తుంది. థాంక్స్ వదిన అని వంశీ అంటాడు. ఏంటి ఈ పనులు అని రుద్ర అడుగుతాడు. జయ ఒంటరిగా ఉందని తోడు వచ్చానని వంశీ ఏదో కవర్ చేస్తుండగా మీ భాగోతం తెలిసిందిగా ఇంకా కవరింగ్ ఎందుకంటూ గంగ అంటుంది. మాకు ఎంగేజ్మెంట్ అయింది.. మా ఇష్టం అని జయ అనగానే షటప్ చేసిందే తప్పు ఇంకా ఎదురు సమాధానమా అని రుద్ర ఫైర్ అవుతాడు. ఆ తర్వాత వంశీని తీసుకొని రుద్ర వెళ్లిపోతాడు. నీ పెళ్ళి జరగదు.. అలా అని ఇలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్స్ ఎన్ని చేసినా అవి అట్టర్ ప్లాఫ్ అవుతాయని గంగ వార్నింగ్ ఇస్తుంది. 

ఇక ఈ ఫైట్ సీక్వెన్స్ అంతా రుద్ర వీడియో తీసి పెద్దసారుకి పంపిస్తాడు. అది చూసి పెద్దసారు మోస్ట్ ఎక్సైట్ అవ్వగా ఇంట్లో వాళ్ళు మేము చూస్తామని అంటారు. దాంతో ఆ వీడియోని టీవీలో‌ కనెక్ట్ చేసి చూపిస్తాడు పెద్దసారు. అదంతా శకుంతల, వీరు అంతా చూసి షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. 

 

 

 

[Jayam Serial Episode 408, Jayam Serial October 24 Episode, Jayam Serial Today Episode, Jayam Serial Latest Episode, Jayam Serial, Telugu TV News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com