
జీ తెలుగులో ప్రసారమవుతున్న సూపర్ హిట్ సీరియల్ 'జయం'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ - 390లో.. బాబు బారసాల గురించి మంచి ముహూర్తం చూడమని శకుంతల పంతులిని పిలిపిస్తుంది. ఎల్లుండి మంచి ముహూర్తం ఉందని పంతులు చెప్తాడు. అయితే బారసాల మా అన్నయ్య, వదిన చేతుల మీదుగా జరగాలని ప్రీతి అంటుంది. మీ అన్నయ్య అంటే బాబుకి మేనమామ అవుతాడు కదా, అలా మేనమామ చేస్తే మరీ మంచిదని పంతులు కూడా అంటాడు.
అయితే వీరు మాత్రం ఇష్టం లేనట్లుగా మొహం పెడతాడు. దాన్ని గమనించిన రంగా.. ఎందుకో వీరుకి ఇష్టం లేనట్లుగా మొహం పెట్టాడనగానే తనకు ఇష్టమే, తన ఇష్టాన్ని ఎప్పుడు కాదన్నాడని వీరు అంటాడు. ఏవండీ మీరే అన్నయ్యకి బారసాల తన చేతుల మీదుగా జరిపించమని చెప్పండి అని ప్రీతి అనగానే వీరుకి ఇష్టం లేకున్నా.. బావా నీ చేతుల మీదుగానే బారసాల జరిపించు అని వీరు అంటాడు.
ఆ తర్వాత వీరు దగ్గరికి ఇషిక వెళ్లి "పాపం బ్రో, నీకు నచ్చనివన్నీ జరుగుతున్నాయి.. అసలు నీ కొడుకు బారసాల వాళ్ల చేతుల మీదుగా ఏంటని అంటుంది. దీంతో వీరు ఇషికకి ఏదో ప్లాన్ చెప్తాడు. వెంటనే శకుంతల దగ్గరికి ఇషిక వెళ్లి..అత్తయ్యా, బ్రోకి వాళ్ల చేతుల మీదుగా బారసాల జరగడం ఇష్టం లేదు.. బాబుకి మేనమామ అంటే బాను అవుతాడు కానీ రుద్ర ఎలా అవుతాడు.. మళ్లీ తనపై కేసు పెట్టాడు.. అందుకే ఇష్టం లేదని చెప్తుంది.
దీంతో శకుంతల హాల్ లోకి వెళ్లి అందరినీ పిలిచి..రుద్ర, గంగ చేతుల మీదుగా బారసాల జరగడం వీరుకి ఇష్టం లేదు.. మేనమామ అంటే బాను కదా.. రుద్ర ఎలా అవుతాడని అంటున్నాడని అంటుంది. అలా ఎలా అంటారు.. రుద్ర అలా ఎప్పుడూ వేరుగా చూడలేదని ఇందుమతి అంటుంది. వీరుకి ఇష్టం లేకుండా ఏదీ జరగదని రుద్ర అంటాడు. అప్పుడే ప్రీతి వచ్చి.. మీ చేతుల మీదుగానే జరగాలి, ఇది నా నిర్ణయమని తెగేసి చెప్తుంది.
ఆ తర్వాత.. ప్రీతికి మీరంటే ఎంత ఇష్టమోనని గంగ అంటే..రుద్ర ప్రతాప్ చెల్లెలు అనిపించుకుందని రంగా అంటాడు. ప్రీతి నమ్మకాన్ని నిలబెట్టాలని రుద్ర అంటాడు. మరి వీరు తన కొడుకు బారసాలను ఆపగలడా.. ఇషిక ప్లాన్ ఏంటనేది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






