
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-217లో.. అందరు కలిసి భోజనం చేస్తుంటారు. పెద్దసారు అందరితో కలిసి మాట్లాడతాడు. అందరికి తమ బిజినెస్ చూసుకోవడం ఓకే కదా అని పెద్దసారు అనగానే ఇషిక, వీరు ఓకే చెప్తారు.
నేను కష్టపడి ఈ కంపెనీలని పేరుని సంపాదించానని, మీరంతా శ్రద్ధగా వర్క్ చేయాలని పెద్దసారు అందరితో చెప్తాడు. దాంతో వీరు.. ఇది మమల్ని మోసం చేసి దాని మీద నిర్మించిన సామ్రాజ్యం.. దీనిని నాశనం చేసేదాకా నేను ఊరుకోను అని వీరు తన మనసులో అనుకుంటాడు.
అప్పుడే రుద్ర చూసి.. ఏంటి వీరు బాగా ఇన్ స్పైర్ అయినట్టున్నావని అడుగుతాడు. అవునని, రోజు మోటివేట్ అవుతానని వీరు అంటాడు. ఒకే ఒకే అందరికి అన్నీ ఇష్టమే కాబట్టి అందరికి ఆల్ ది బెస్ట్ అని చెప్తాడు. పెద్దసారు నేను మాత్రం ఇంటి బాధ్యతలు అన్నీ చూసుకుంటానని గంగ అనగానే అవును సిలిండర్ లు, లగేజ్ లు మోసేదానికి ఇది పెద్ద కష్టమేం కాదు కదా అని శకుంతల అంటుంది. దాంతో ఇషిక, వీరు హ్యాపీగా ఫీల్ అవుతారు.
శకుంతల గతం గురించి ఎందుకు.. తను ఈ ఇంటికి కోడలు అనే విషయం మర్చిపోకు అని పెద్దసారు అంటాడు. దాంతో రుద్ర హ్యాపీగా ఫీల్ అవుతాడు. మా చెల్లి బాగా పనిచేస్తుందని గంగ వాళ్ళ అన్నయ్య అంటాడు. అవును గంగ ఈటింగ్, ఫైటింగ్ బాగా చేస్తుందని రుద్ర అనగానే అందరు నవ్వుకుంటారు. గంగ డల్ గా ఉంటుంది. ఆ తర్వాత అందరు భోజనం చేస్తారు.
ఆ తర్వాత గంగ వాళ్ళ అన్నయ్య, ప్రమీల, గంగ ముగ్గురు కలిసి గుడికి వెళ్తారు. అదేంటి గంగ ఇక్కడికి తీసుకొచ్చావని ప్రమీల అడగగా.. నీకొక కొత్త జీవితం ఇవ్వాలని దేవుడికి మొక్కుకోవడానికి తీసుకొచ్చానని అనగానే తను షాక్ అవుతుంది. అదేంటి అనగానే నీ లైఫ్ ఇంకా బాగుండాలనే అని గంగ కవర్ చేస్తుంది.
మరోవైపు ఒకతను వచ్చి నాకు పెళ్ళి కావాలని అర్చన చేయమని, దీవించమని అతను అనగానే పూజారి షాక్ అవుతాడు. ఏంటని అతను అనగానే అందరు పెళ్ళిళ్ళు వద్దంటుంటే నువ్వు చేసుకుంటానని అంటున్నావని షాక్ అయ్యానని పూజారి చెప్తాడు. అది నా చిన్నప్పటి నుండి కల అని అతను చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






