Home

»

Tv News

Godhavari : శంకర్ ఫ్యామిలీలో కొత్త జోష్.. జానూ అల్లరికి సూర్య ఫిదా!

May 16, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -05 లో ......శంకర్ ఫ్యామిలీతో భోజనం చెయ్యడానికి సిద్ధం అవుతాడు. జానూ ఎక్కడ అని శంకర్ అడుగగా.. అప్పుడే జానూ ఎంట్రీ ఇస్తుంది. నాన్న నీ కోసం ఏం తీసుకొని వచ్చానో చూడమని చెప్తుంది. నేతి పరోటా అని శంకర్ చెప్పగానే కరెక్ట్ గా గెస్ చేసావని జానూ అంటుంది. ఆ తర్వాత అందరికి శంకర్ భోజనం తినిపిస్తాడు. మరొకవైపు భువన, సూర్య చెస్ ఆడుతారు. ఆటపై శ్రద్ధ పెట్టకుండా జానూ గురించి ఆలోచిస్తాడు సూర్య.

భువన కూడా తనని అవమానించిందని జానూనే గుర్తుచేసుకుంటుంది. ఇద్దరు ఒకే అమ్మాయిని గుర్తు చేసుకుంటున్నారు అనుకుంటా అని తుఫాన్ అంటాడు. అమ్మ ఏంటి అలా ఉన్నావని సూర్య అడుగుతాడు. ఆ పొగరుబోతు పిల్ల నన్ను అవమానించిందని భువన అనగానే అందులో అవమానం ఏముంది.. వాళ్ళ నాన్నతో ప్రైజ్ తీసుకోవాలని అనుకుందని సూర్య చెప్తాడు. ఆ తర్వాత ఒళ్ళంతా నొప్పిగా ఉందని కిన్నెర, గౌతమిని జానూ మసాజ్ చెయ్యమంటుంది. ఆ తర్వాత అలకనంద తన ఫ్రెండ్ ఫారెన్ లో ఉంటుంది.. తనతో మాట్లాడుతుంది.. నేను కూడా అమెరికా సంబంధం చేసుకొని అక్కడికి వస్తానని అంటుంది. ఆ మాటలు జానూ వాళ్ళు విని ఆటపట్టిస్తారు.

మరొకవైపు తన సంపాదన గురించి శంకర్ తన భార్యకి చెప్తాడు. తను వింటూనే నిద్రపోతుంది. ఆ తర్వాత శంకర్ తన ఫ్రెండ్ సింహాద్రికి ఫోన్ చేసి తోట కొన్నాను కదా ఎక్కడ వరకు వచ్చిందని అంటాడు. నువ్వు లేవని రిజిస్ట్రేషన్ చేయించలేదు అంటాడు. సరే రేపు ఒకసారి తోటకి కుటుంబాన్ని తీసుకొని వస్తానని శంకర్ చెప్పగానే అది నీ తోట రా నీ ఇష్టం అని సింహాద్రి అంటాడు. ఆ తర్వాత జానూ తన చెల్లెల్లకి దగ్గర ఉండి కావలసినవి ఇస్తుంటే శంకర్ మురిసిపోతాడు. ఆ తర్వాత మరుసటిరోజు మా అక్క నిన్ను పెళ్లి చేసుకోనంటే ఏం చేస్తావ్ బావ అని మురళిని జానూ  ఆటపట్టిస్తుంది. దాంతో జానూని  చెవి పట్టి మెలేస్తాడు. అప్పుడే సూర్య చూస్తాడు. నీ జానూని ఎవరో ఏడిపిస్తున్నాడని తుఫాన్ చెప్పగానే సూర్య కోపంగా చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com