Home

»

Tv News

రోజంతా సీరియల్‌లో పనిచేస్తే రూ.1000 నుంచి రూ.1500.. జగతి మేడం కష్టాలు తెలిస్తే కన్నీళ్లే

Oct 28, 2026 11:38AM

గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి మేడం గురించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే హీరోయిన్ రక్షా గౌడ కానీ సెకండ్ హీరోయిన్ జగతి మేడం. అలాంటి జగతి మేడం అసలు పేరు జ్యోతి పూర్వాజ్. ఆమె ఇప్పుడు మూవీస్ లో నటిస్తోంది. రీసెంట్ గా oka ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది. "నాకు ఉన్నది ఒక క్రెటా ఇంకో ఆడి అది అతని కార్. అమ్మకు కాన్సర్ దైవ క్షేత్రాలు తిప్పమని అడిగింది. అప్పటికి నాకు పెద్ద కార్ కొనే శక్తి లేదు. మారుతి వాళ్ళు ప్రొడక్షన్ ఆపేసారు అప్పటికి. అమ్మ కోసమే కార్ తీసుకోవాలని అనుకున్నాను.

అమ్మ అడిగింది నువ్వు కార్ తీసుకుని నన్ను అన్ని టెంపుల్స్ కి తీసుకెళ్ళాలి అని. ఐతే అప్పటికి డబ్బులు సరిపోయేవి కాదు. ఇంట్లో నేనొక్కదాన్నే సంపాదించేది. ఇప్పుడు ఉన్నంత పేమెంట్స్ కూడా అప్పట్లో లేవు. ఒక సీరియల్ లో రోజంతా పని చేస్తే 1000 నుంచి 1500 ఇచ్చేవాళ్ళు. తర్వాత తర్వాత పెరిగింది. ఆ వచ్చిన డబ్బుల్లోన్నే ఇల్లు చూసుకోవాలి రెంట్ కట్టాలి తమ్ముడిని చూసుకోవాలి అమ్మ ట్రీట్మెంట్స్ చేయాలి అంటే సరిపోయి కాదు. కానీ ఇప్పుడు పర్లేదు " అని చెప్పింది.

ఇక డైరెక్టర్ పూర్వాజ్ కూడా తన మూవీ విషయం గురించి చెప్తూ తనకు సింగీతం గారంటే ఇష్టం అని చెప్పుకొచ్చాడు. "నాకు ఫేవరేట్ అని అలా అని చెప్పను. నా మనసుకు బాగా ఇష్టమైన వ్యక్తి. తీసిన ఐదారు సినిమాలు చాలా గొప్పవి. పుష్పక విమానం, ఆదిత్య 369, భైరవ ద్వీపం, సింగీతం ఏది పట్టుకున్నా అందులో కొత్తదనం ఉండాలి అది ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి, కమర్షియల్ నెస్ ఉండాలి. అలాగే ఒకే ఒక్కడు, జెంటిల్ మెన్, రోబో మూవీస్ చూస్తే చాలా ఎక్స్పీరియన్స్ ఫీలవుతారు. నాకు కూడా అలాంటి సినిమాలు తియ్యడం ఇంటరెస్ట్. కొత్తదనం చూపిస్తేనే నిలబడగలం. లేదంటే జీవితానికి కొత్తదనం ఉండదు " అని  చెప్పుకొచ్చాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com