Home

»

Tv News

డబ్బు అవసరంతోనే బిగ్ బాస్ కి వెళ్తున్నా.. లోన్ లో ఇల్లు తీసుకున్నానంటూ జబర్దస్త్ నరేష్ ఎమోషనల్!

Sep 30, 2026 9:29AM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 లో అడుగుపెట్టిన జబర్దస్త్ కమెడియన్ నరేష్ బిగ్ బాస్ హౌస్ కి వెళ్లే ముందు చేసిన వ్లాగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆది, శాంతి స్వరూప్ తో కలిసి నరేష్ రెస్టారెంట్ కి వెళ్లి ఈ వ్లాగ్ చేశాడు. అందులో తను బిగ్ బాస్ కి ఎందుకు వెళ్తున్నాడో క్లియర్ గా చెప్పుకొచ్చాడు. తనకు అన్నం పెట్టిన మల్లెమాల జబర్దస్త్ ని వదిలి వెళ్లడం బాధగా ఉన్నా, తనకు డబ్బు చాలా అవసరం అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని నరేష్ చెప్పాడు.

నేను లోన్ లో ఇల్లు తీసుకున్నాను. అది నాకు బాగా ప్రెషర్ అవుతుంది. బిగ్ బాస్ ద్వారా వచ్చే డబ్బుతో ఆ లోన్ క్లియర్ చేసుకోవాలని అనుకుంటున్నా. ఇల్లు కొనుక్కోవడం గొప్ప కాదు.‌ ఆ ఇల్లుని దక్కించుకోవడం ఒక అచీవ్‌మెంట్ అంటూ నరేష్ ఎమోషనల్ అయ్యాడు. తన ఫైనాన్షియల్ పరిస్థితి గురించి ఓపెన్ గా మాట్లాడటంతో ఫ్యాన్స్ అతనికి సపోర్ట్ గా నిలుస్తున్నారు.

 ఈ వ్లాగ్ లో ఆది కూడా మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ముగ్గురికి సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేశాడు. మీరు బిగ్ బాస్ లో నరేష్, ఇంకా రామ్ ప్రసాద్, వర్షిణికి సపోర్ట్ చేయండి అని ఆది చెప్పుకొచ్చాడు. తన జబర్దస్త్ టీం నుంచి ముగ్గురు బిగ్ బాస్ కి వెళ్లడం ఆనందంగా ఉందని, వారికి ప్రేక్షకులు అండగా ఉండాలని కోరాడు.

 దీనికి నరేష్ కూడా స్పందిస్తూ.. నాకు ఇప్పటివరకు ఫైనాన్షియల్ గా ఆది అన్న ఎంతో సపోర్ట్ చేశాడని చెప్పాడు. తన కష్టకాలంలో ఆది తనకు అండగా నిలిచాడని‌‌ .. ఆ స్నేహాన్ని ఎప్పటికీ మర్చిపోనని నరేష్ ఎమోషనల్ గా చెప్పాడు. బిగ్ బాస్ హౌస్ లో నరేష్ ఎలా ఆడతాడో, తన లోన్ క్లియర్ చేసుకునేంత ప్రైజ్ మనీ గెలుస్తాడో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

 

 

Jabardasth Naresh Bigg Boss 10, Naresh Bigg Boss Reason, Naresh Loan House Emotional, Aadi Shanti Swaroop Vlog, Bigg Boss Telugu 10 Contestants

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com